Bigg Boss Elimination : బిగ్ బాస్ హౌస్‌లో సండే ఊహించని షాక్.. సృష్టి షాకింగ్ ఎలిమినేషన్..
Bigg Boss Elimination : డేంజర్‌జోన్‌లో ఉన్న షాలిని, సృష్టిలో సృష్టి ఎలిమినేట్ అయినట్లు కింగ్ నాగార్జున ప్రకటించారు. సృష్టి వెళ్లిపోవడంతో.. షాలిని ఎప్పటిలాగే కాసేపు ఎమోషనల్ డ్రామా ఆడింది.
Bigg Boss Elimination
శనివారం ఎపిసోడ్‌లో తప్పులు చేసిన రోహిత్, అమన్, త్రిగుణ్‌కు హోస్ట్ నాగార్జున ఎల్లో కార్డులు ఇచ్చి ఊహించని షాక్ ఇవ్వగా, ఆదివారం ఎపిసోడ్ మాత్రం క్రేజీ గేమ్స్, ఎమోషన్స్, ఊహించని డ్రామాల మధ్య ఇంట్రెస్టింగ్‌గా సాగింది. నిజానికి రీ ఎంట్రీ ఇచ్చిన చరణ్ ఎలిమినేట్ అవుతాడని అంతా భావించినా.. చివరికి సృష్టి బిగ్ బాస్ హౌస్‌కి గుడ్‌బై(Bigg Boss Elimination) చెప్పడం ఆడియన్స్‌కు మైండ్ బ్లాక్ ఇచ్చింది.
ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ముకేశ్, దేబ్జానీ సేఫ్ అవ్వగా, ఆ తర్వాత బాయ్స్ వర్సెస్ గర్ల్స్ మధ్య సినిమాల్లోని వృత్తుల ఆధారంగా యాక్టర్లను ఐడిండిఫై చేసే ఫన్ గేమ్ ఆడించి డ్యాన్సులతో సందడి చేశారు నాగ్. ఈ గ్యాప్‌లో నామినేషన్ల నుంచి నరేష్, చరణ్, త్రిగుణ్ కూడా సేఫ్ జోన్‌లోకి చేరారు.
తర్వాత రౌండ్‌లో నాగార్జున అడిగిన ఆన్సర్స్‌తో మ్యాచ్ అయ్యే ఆన్సర్స్ చెప్పి చాక్లెట్లు గెలుచుకునే ఆటలో వంశీ, దేబ్జానీ, నరేష్, వర్షిణి, షాలిని, ముకేశ్, త్రిగున్, చరణ్, రామ్ ప్రసాద్ విన్ అయ్యారు. ఇక ఈ వీక్‌కు సంబంధించిన స్టార్ ప్లేయర్ ఎవరనే దానిపై ఓటింగ్ పెట్టగా వంశీ, ఝాన్సీ, సృష్టికి ఈక్విల్‌గా చెరో నాలుగు ఓట్లు వచ్చాయి. దాంతో రీ-ఓటింగ్ కండెక్ట్ చేయగా ఎక్కువ ఓట్లు సాధించిన ఝాన్సీ ఈ వీక్ స్టార్ ప్లేయర్‌గా నిలిచింది. దీంతో బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ బహుమతిని తన ఫేవరేట్ కంటెస్టెంట్ అయిన ముకేశ్‌కి ఇచ్చింది ఝాన్సీ.
దీని తర్వాత హౌస్‌మేట్స్‌ని ముగ్గురు ముగ్గురు గ్రూపులుగా విడదీసిన నాగార్జున వారికి పడవ టాస్క్ పెట్టారు . ఒకరు కెప్టెన్‌గా ఉంటూ మిగిలిన ఇద్దరిలో ఒకరిని ముంచడం, మరొకరిని సేవ్ చేయడమనే గేమ్ పెట్టారు. ఈ మైండ్ గేమ్‌లో ముకేశ్ సుధీర్‌ని, నరేష్ రామ్ ప్రసాద్‌ని, అమన్ అపూర్వని, సృష్టి వంశీని ముంచుతామని చెప్పారు. రోహిత్, షాలిని, అపూర్వ లవ్ ట్రాక్‌కి చెక్ పెడుతూ నాగార్జున రోహిత్‌ని ప్రశ్నించగా.. అంతా ఊహించినట్టే అపూర్వను ముంచిన రోహిత్.. షాలినిని సేవ్ చేశాడు. అలాగే షాలిని కూడా ఝాన్సీని ముంచి రోహిత్‌ని కాపాడుకుంది. మధ్యలో నామినేషన్ల నుంచి రోహిత్, అమన్ కూడా సేఫ్ అయ్యారు.

చివరికి డేంజర్‌జోన్‌లో ఉన్న షాలిని, సృష్టిలో సృష్టి ఎలిమినేట్(Bigg Boss Elimination) అయినట్లు కింగ్ నాగార్జున ప్రకటించారు. సృష్టి వెళ్లిపోవడంతో.. షాలిని ఎప్పటిలాగే కాసేపు ఎమోషనల్ డ్రామా ఆడింది. ఎలిమినేట్(Bigg Boss Elimination) అయిన సృష్టి స్టేజ్‌పైకి వచ్చి బిగ్ బాస్ ఇంట్లో ముకేశ్, రామ్ ప్రసాద్, వర్షిణి మాస్కులు వేసుకుని ఆడుతున్నారంటూ చెప్పేసింది.
ఈ మధ్యలో చరణ్ మాట్లాడే ప్రయత్నం చేయడంతో.. వీక్‌కు ఒకసారి బయటకు వెళ్లొస్తున్నావు, నువ్వు ఆడేదేముంది అంటూ నాగ్ వేసిన పవర్‌ఫుల్ సెటైర్‌కి హౌస్ మొత్తం నవ్వుల్లో మునిగిపోయింది. లాస్ట్ వీక్ టోటల్ డామినేషన్ థీమ్ నడవగా, రాబోయే వారం రోడ్ టు రీలోడ్ అనే కాన్సెప్ట్‌తో సాగబోతోందని అనౌన్స్ చేయడంతో సోమవారం జరిగే నామినేషన్లపై మరింత హైప్ పెరిగింది.
Nuclear Weapons : గ్లోబల్ న్యూక్లియర్ పవర్ గేమ్‌లో దూసుకుపోతున్న ఇండియా ..భారత్ వద్ద 190 అణ్వాయుధాలు





