Bigg BossJust EntertainmentLatest News

Bigg Boss Voting : బిగ్ బాస్ ఓటింగ్‌లో ఊహించని షాక్.. టాప్ ప్లేస్‌లో రోహిత్, ఆ ఇద్దరు డేంజర్ జోన్..

Bigg Boss Voting : సోషల్ మీడియా వేదికగా షాలినిపై భారీగా ట్రోలింగ్ నడుస్తున్నా.. బిగ్ బాస్ షోకి కావాల్సినంత కంటెంట్, రచ్చ ఆమె నుంచే వస్తోందన్నది ఒప్పుకోవాల్సిన నిజం.

Bigg Boss Voting

బుల్లితెరపై రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఊహించని మలుపులతో ఆడియన్స్‌లో ఉత్కంఠను నింపుతోంది. ఐదో వారంలో ఒకేసారి ఇద్దరు కంటెస్టెంట్స్ ఊహించని విధంగా హౌస్ నుంచి బయటకు వెళ్లి ప్యాకప్ చెప్పగా.. వారి ప్లేస్‌ను రీప్లేస్ చేస్తూ ఐదుగురు కొత్త వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్‌ను హీటెక్కిస్తూ ఎంట్రీ ఇచ్చారు.

ఈ కొత్త వైల్డ్ ఫైర్స్ రాకతో బిగ్ బాస్ హౌస్‌లో పాతవాళ్ల మైండ్ గేమ్స్ బోల్తా పడ్డాయి. దానికి తగ్గట్టుగానే ఆరో వారం నామినేషన్స్ ప్రాసెస్ లంకను తలపించేలా యమ హీట్‌గా సాగింది. మెయిన్‌గా కామనర్లకు, సెలబ్రిటీలకు మధ్య నడిచిన మాటల యుద్దం నామినేన్‌లో ఒక రేంజ్ వార్‌ను తలపించింది. ఈ డ్రామా, ఆర్గ్యుమెంట్స్ ముగిసేసరికి మొత్తంగా ఆరుమంది కంటెస్టెంట్స్ ఎలిమినేషన్‌లో నిలిచారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి వచ్చిన కొత్త ప్లేయర్లే ఈ వారం నామినేషన్లకు ప్రధాన వేదికగా మార్చాడు బిగ్ బాస్.

ఈ ఆరో వారంలో ఎలిమినేషన్ జోన్‌లో నిలిచిన వారి జాబితాను చూస్తే షాలిని, వర్షిణి, వంశీ, రాం ప్రసాద్, అమన్ , రోహిత్ ఉన్నారు. వీరి జాతకాలను తేల్చే ఆన్‌లైన్ ఓటింగ్(Bigg Boss Voting) ఆల్రెడీ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్స్, అన్ అఫీషియల్ పోల్స్ నుంచి అందుతున్న తాజా ఇన్ఫో ప్రకారం ఓటింగ్‌(Bigg Boss Voting)లో ఊహించని ఝలక్‌లు కనిపిస్తున్నాయి.

ఎవరెన్ని స్ట్రాటజీలు ప్లే చేసినా తనే నెగిటివ్‌గా బిహేవ్ చేసినా కూడా రోహిత్‌కు మాత్రం ఆడియన్స్ నుంచి ఓట్ల వర్షం బాగానే కురుస్తోంది. ముకేష్, త్రిగుణ్ వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఈ వీక్ నామినేషన్లలో లేకపోవడం రోహిత్‌కు భారీగా ప్లస్ అయింది. దీంతో రోహిత్ ఏకంగా ఫస్ట్ ప్లేస్‌లో దూసుకుపోతూ తన సేఫ్ జోన్‌ను పక్కా చేసుకున్నాడన్న టాక్ నడుస్తోంది.

ఇక రోహిత్ తర్వాత రెండో స్థానంలో రామ్ ప్రసాద్ తన పాపులారిటీతో ఓట్లను రాబడుతున్నాడు. మరోవైపు కామనర్ కేటగిరీ నుంచి వచ్చిన అమన్ మూడో ప్లేస్‌లో ఉండి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. నామినేషన్ ప్రాసెస్‌లో షాలిని, రోహిత్‌కు తన టెంపర్‌తో చుక్కలు చూపించిన వంశీ.. ఓటింగ్‌లోనూ తన కసితనాన్ని చూపిస్తూ ప్రస్తుతం ఫోర్త్ ప్లేస్‌లో సేఫ్‌గా కంటిన్యూ అవుతున్నాడు. దీనిబట్టి చూస్తే ఈ వారం ఎలిమినేషన్ ముప్పు నుంచి వంశీ దాదాపు తప్పించుకున్నాడనే చెప్పొచ్చు.

అసలు సస్పెన్స్ అంతా చివరి రెండు ప్లేసులలోనే ఉంది. ప్రస్తుతం ఐదో స్థానంలో యాంకర్ వర్షిణి ఊగిసలాడుతుంటే, ఫైర్ బ్రాండ్‌లా విరుచుకుపడే షాలిని ఆరో ప్లేస్‌లో ఉండి డేంజర్ జోన్‌లో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం ఈ ఇద్దరిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. సోషల్ మీడియా వేదికగా షాలినిపై భారీగా ట్రోలింగ్ నడుస్తున్నా.. బిగ్ బాస్ షోకి కావాల్సినంత కంటెంట్, రచ్చ ఆమె నుంచే వస్తోందన్నది ఒప్పుకోవాల్సిన నిజం. అందుకే మేకర్స్ ఆమెను అంత ఈజీగా బయటకు పంపరనే ప్రచారం కూడా గట్టిగా సాగుతోంది.

Bigg Boss Voting
Bigg Boss Voting

మరోవైపు వర్షిణి తన కూల్ అండ్ స్టడీ గేమ్‌తో క్లాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. అయితే ఎంటర్‌టైన్‌మెంట్ లేదా డ్రామా పరంగా ఊహించినంత స్ట్రాంగ్ కంటెంట్‌ను ఆమె ఇవ్వలేకపోతోందనే కామెంట్స్ వస్తున్నాయి. నామినేషన్ లీక్స్ ప్రకారం ఈ ఇద్దరు భామల ఎలిమినేషన్ గండం ఎటు తిరుగుతుందా లేదంటే బిగ్ బాస్ తనదైన స్ట్రాటజీతో సీన్ రివర్స్ చేసి మరొకరికి షాక్ ఇస్తాడో తెలియాలంటే నాగ్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Hyderabad Water Crises : భాగ్యనగర దాహార్తి తీరే దారేది?.. ఎల్ నినో దెబ్బకు హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న నీటి సవాల్..

Related Articles

Back to top button