Bigg BossJust EntertainmentLatest News

Dictators : ముకేష్‌ కామెంట్స్‌పై నరేష్ సెటైర్.. చివరికి రద్దయిన గేమ్..

Dictators : బిగ్‌బాస్ తెలుగు 10లో 74వ రోజు డిక్టేటర్స్ టాస్కుల్లో వర్షిణిని స్ట్రాంగ్ ప్లేయర్‌గా ముకేష్ చెప్పడంతో.. నరేష్ చేసిన సెటైరికల్ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి

Dictators

బిగ్ బాస్ ఎండింగ్‌కు వచ్చేసరికి అందరూ మైండ్‌గేమ్‌కు పనిపెడుతున్నారు. దీంతో బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరు స్ట్రాంగ్ కంటిస్టెంట్‌ ఎవరు వెనుకబడుతున్నారనే విషయాలు బయట ప్రతిరోజూ కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా టాస్కుల సమయంలో కంటెస్టెంట్ల మధ్య అభిప్రాయ భేదాలు, ఒకరిపై మరొకరు వేసుకునే సెటైర్లు ఆడియన్స్‌కు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్నాయి.

తాజాగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 74వ రోజు అంటే గురువారం జరిగిన డిక్టేటర్స్(Dictators) గేమ్స్‌లోనూ ఇలాంటి ఆసక్తికర పరిణామాలే చోటుచేసుకున్నాయి. ముకేష్‌ తన టీమ్‌లో వర్షిణిని స్ట్రాంగ్ ప్లేయర్‌గా చెప్పడంతో.. దానిపై నరేష్ స్పందించిన తీరు హౌస్‌లో నవ్వులను పూయించింది.

74వ రోజు గేమ్‌లో భాగంగా డిక్టేటర్స్‌గా వ్యవహరిస్తున్న త్రిగుణ్, ముకేష్ టీమ్స్ మధ్య పోటీ జరిగింది. ముందుగా వంశీ, ఆర్కే ఒక టాస్క్‌లో తలపడ్డారు. ఈ గేమ్‌కు వర్షిణి, శివ్ సంచాలకులుగా వ్యవహరించారు. వంశీ, రామకృష్ణ తమ శక్తిమేరకు ప్రయత్నించినా కూడా, టాస్క్ ముగిసిన తర్వాత విజేత విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదు. డిక్టేటర్స్(Dictators) మధ్య కూడా డెసిషన్ విషయంలో క్లారిటీ రాకపోవడంతో బిగ్‌బాస్ కీలక నిర్ణయాన్ని తీసుకుని.. ఆ గేమ్‌ను పూర్తిగా కేన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వంశీ, ఆర్కే చేసిన ప్రయత్నాలన్నీ వేస్ట్ అయినట్లు అయిపోయాయి .

దీని తర్వాత ముకేష్ తన టీమ్ సభ్యుల ఆటతీరుపై రేటింగ్ ఇచ్చాడు. తన టీమ్‌లో రామ్ ప్రసాద్‌ను వీకెస్ట్ ప్లేయర్‌గా, నరేష్‌ను వీక్ ప్లేయర్‌గా చెప్పిన ముకేష్.. వర్షిణిని స్ట్రాంగ్ ప్లేయర్‌గా, అమన్‌ను స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్‌గా సెలక్ట్ చేశాడు.

అటు త్రిగుణ్ కూడా తన టీమ్ సభ్యుల స్ట్రెంత్‌లను వివరించాడు. శివ్‌ను స్ట్రాంగెస్ట్‌గా, దేబ్జానీని స్ట్రాంగ్‌గా పేర్కొనగా.. నీతూను వీక్, వంశీని వీకెస్ట్ ప్లేయర్‌గా చెప్పుకొచ్చాడు.

ఇదే టైమ్‌లో త్రిగుణ్ టీమ్ ముందంజలో ఉండటంతో బిగ్‌బాస్ వారికి ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చారు. తమ టీమ్ నుంచి ఒకరిని ముకేష్‌ టీమ్‌లోకి పంపించి, అక్కడి నుంచి మరొకరిని తమ జట్టులోకి తీసుకోవచ్చని చెప్పారు. ఈ ఛాన్స్‌ను ఉపయోగించుకున్న త్రిగుణ్.. నీతూని ముకేష్‌ టీమ్‌కు పంపించి, అమన్‌ను తన జట్టులోకి తీసుకున్నాడు.

ఈ మార్పుల మధ్య నరేష్ చేసిన కామెంట్‌ మాత్రం అందరి దృష్టిని ఆకట్టుకుంది. రామ్ ప్రసాద్, దేబ్జానీతో మాట్లాడుతున్న సమయంలో ముకేష్.. వర్షిణిని స్ట్రాంగ్ ప్లేయర్‌గా చెప్పిన విషయాన్ని ప్రస్తావించాడు. దీంతో వర్షిణి ఇంత స్ట్రాంగ్ ప్లేయర్ ఎలా అయింది అన్నట్లుగా నరేష్ వ్యంగ్యంగా ప్రశ్నించాడు. నరేష్ సెటైర్‌తో అక్కడున్న కంటెస్టెంట్లు అంతా ఒక్కసారిగా నవ్వేశారు.

ఆ తర్వాత మరో గేమ్ నిర్వహించారు. ఈసారి త్రిగుణ్ టీమ్ తరఫున అమన్, దేబ్జానీ బరిలోకి దిగగా.. ముకేష్ టీమ్ నుంచి వర్షిణి, రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ టాస్కులో త్రిగుణ్ జట్టు విజయాన్ని అందుకుంది.

మొత్తానికి 74వ రోజు ఆటలో త్రిగుణ్ టీమ్ డామినేషన్ కనిపించింది. మరోవైపు వర్షిణి ఆటతీరుపై ముకేష్ ఇచ్చిన రేటింగ్, దానిపై నరేష్ వేసిన సెటైర్ హైలైట్ అయ్యాయి. రాబోయే టాస్కుల్లో ఈ కంటెస్టెంట్లు తమ గేమ్‌పై ఎలాంటి సమాధానాన్ని ఇస్తారో చూడాలి.

GYM Rules : జిమ్‌లో ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఇవే.. జిమ్ లవర్స్ తెలుసుకోవాల్సిన డేంజర్ సైన్

Related Articles

Back to top button