Bigg BossJust EntertainmentLatest News

Nagarjuna class:సారీ చెప్పనని మొండికేసిన సంజన.. నాగార్జున క్లాస్

Nagarjuna class: శనివారం ఎపిసోడ్‌లో సంజన తన ప్రవర్తనతో అందరికీ షాక్ ఇచ్చింది. తాను అస్సలు తప్పు చేయలేదని, అస్సలు సారీ చెప్పేది లేదని గట్టిగా వాదించింది.

Nagarjuna class

బిగ్ బాస్ సీజన్ 9, 12వ వారం నామినేషన్స్ ప్రక్రియ నిజంగానే హౌస్‌లో పెద్ద హీట్‌ను పెంచింది. ముఖ్యంగా డీమాన్, కళ్యాణ్ మధ్య జరిగిన వాగ్వాదం, అలాగే రీతూపై సంజన చేసిన కామెంట్లు ఈ వారానికి హాట్ టాపిక్‌గా మారాయి. సంజన మాటలు రీతూ క్యారెక్టర్‌ను కించపరిచేలా ఉన్నాయంటూ ఇంట్లో చాలామంది హౌస్‌మేట్స్ సీరియస్ అయ్యారు. అయినప్పటికీ సంజన ఏమాత్రం తగ్గలేదు.

ఈ వివాదంపై హోస్ట్ నాగార్జున (Nagarjuna class)ఎలా రియాక్ట్ అవుతారో అని ఆడియన్స్ చాలా ఆసక్తిగా వెయిట్ చేశారు. కానీ శనివారం ఎపిసోడ్‌లో సంజన తన ప్రవర్తనతో అందరికీ షాక్ ఇచ్చింది. తాను అస్సలు తప్పు చేయలేదని, అస్సలు సారీ చెప్పేది లేదని గట్టిగా వాదించింది. “నేను చూసింది చెప్పాను, హౌస్ వాతావరణం చెడగొట్టినందుకు నేను కావాలంటే బయటకు వెళ్లిపోతాను, కానీ సారీ మాత్రం చెప్పను” అంటూ మొండిగా నిలబడింది.

అయినా నాగార్జున (Nagarjuna class)వదిలిపెట్టకుండా, ఆ వివాదం యొక్క సీరియస్‌నెస్‌ను సంజనకు వివరించారు. దీంతో చివరకు సంజన దిగివచ్చి ఎట్టకేలకు సారీ చెప్పింది.

ఈ వారం అందరినీ డిస్టర్బ్ చేసిన ఇష్యూ ఏంటని నాగార్జున హౌస్‌మేట్స్‌ను అడగ్గా, ఇమ్మూ వెంటనే సంజన, రీతూ గొడవ గురించే చెప్పాడు. దీనిపై సంజన క్లారిటీ ఇస్తూ, “నాకు ఇబ్బందిగా అనిపించింది, పక్క పక్కనే కూర్చోవడం నచ్చలేదు అని చెప్పాను కానీ మరో పదం వాడలేదు కదా” అంటూ వివరణ ఇచ్చింది. వాళ్లను చూస్తూ నాకు అన్‌కంఫర్టబుల్‌గా అనిపించింది కాబట్టి నేనే దుప్పటి కప్పుకున్నా అని తన మాటపైనే గట్టిగా నిలబడింది.

Nagarjuna class
Nagarjuna class

అయితే, సంజన క్లారిటీ ఇవ్వకముందే, నాగార్జున అంతకు ముందు రీతూ, పవన్ గురించి తనూజతో సంజన మాట్లాడిన వీడియో క్లిప్‌ను ప్లే చేసి చూపించారు. ఆ వీడియో ఆధారంగా, నామినేషన్స్‌లో చెప్పడానికి కావాలని ముందు నుంచే ప్లాన్ చేసుకుని చెప్పినట్లు ఉందని నాగార్జున తెలిపారు. అలాగే, డీమాన్‌తో నామినేషన్లలో “నువ్వు మధ్యలోకి రాకు” అని ముందుగా ఎందుకు చెప్పావ్ అని కూడా ప్రశ్నించారు.

సంజనకు అర్థమయ్యేలా చెప్పడానికి, నాగార్జున ఉదాహరణలతో వివరించారు. “నువ్వు ఇమ్మూ తలకు ఆయిల్ పెట్టావ్, మరీ అది కూడా చూడటానికి ఇబ్బందిగానే ఉంది కదా,” అని అడిగారు. అలాగే, “10 ఏళ్లు కష్టపడి ఇక్కడి దాకా వచ్చావు కదా. చిన్న షోలు చేసుకునే వాళ్లు ఇక్కడ ఉండకూడదా? నువ్వు బయట ఏదో తప్పు చేశావ్ కాబట్టి నీపక్కన ఉండడానికి ఇబ్బందిగా ఉంది అని వేరే వాళ్లు నీతో అంటే నీకు ఎలా ఉంటుంది?” అంటూ క్యారెక్టర్ గురించి మాట్లాడటం ఎంత పెద్ద తప్పో వివరించారు.

“నీకు ఇబ్బందిగా ఉంటే బయటకు వెళ్లిపో” అని నాగార్జున గట్టిగా చెప్పడంతో, “లేదంటే సారీ చెప్పు” అని అన్నారు. దీంతో సంజన సారీ చెప్పడానికి ససేమిరా అంది. “బయటకు వెళ్లిపోతాను. ఇక భరించలేకపోతున్నాను, అసలు ఉండను” అంటూ వేడుకుంది. “మేము త్యాగం చేస్తేనే నువ్వు ఇక్కడ ఉన్నావు. ఆ మాటలు విని ఉండడం నా వల్ల కాదు, నేను బయటకు వెళ్లిపోతాను” అని వాదించింది. కానీ “ఒక అమ్మాయి మీద అంత పెద్ద బ్లాక్ మార్క్ వేసి ఎలా వెళ్తావు” అంటూ, చివరకు నాగార్జున సంజనతో సారీ చెప్పించి, ఆ వివాదానికి తెరదించారు.

Tirumala Hair Donation: శ్రీవారికి సమర్పించే తలనీలాలు ఎంత మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధో తెలుసా?

Related Articles

Back to top button