Just EntertainmentJust CrimeLatest News

iBomma : ఐబొమ్మ ఈజ్ బ్యాక్.. సైలెంట్‌గా రీ-ఎంట్రీ ఇచ్చిన పైరసీ కింగ్

iBomma: థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే, హై క్వాలిటీతో ఈ ఐ బొమ్మ (iBomma)సైట్‌లో ప్రత్యక్షమవుతుండటం మూవీ మేకర్స్‌కు మరోసారి పెద్ద తలనొప్పిగా మారింది.

iBomma

తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ కాంట్రవర్సీయల్‌తో పాటు పాపులర్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘ఐబొమ్మ’ (iBomma) మళ్లీ నెట్టింట ఫుల్‌గా హల్‌చల్ చేస్తోంది. క్లోజ్ అయిపోయిందనుకున్న ఈ వెబ్‌సైట్, సడెన్‌గా రీ-ఎంట్రీ ఇచ్చి అందరినీ షాక్‌కు గురిచేసింది. ఐ బొమ్మ నెట్వర్క్ వ్యవస్థాపకుడు రవిపై పోలీసులు తీసుకున్న సీరియస్ యాక్షన్ తర్వాత.. ఈ సైట్ చాప్టర్ క్లోజ్ అయిందని అందరూ ఫిక్స్ అయిపోయారు, కానీ ఇప్పుడు మళ్లీ యాక్టివ్ కావడంతో సోషల్ మీడియా వ్యాప్తంగా మరోసారి ఐ బొమ్మ న్యూస్ వైరల్ అయింది.

ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఐబొమ్మ.. తన పాత వేగాన్ని ఏమాత్రం తగ్గించలేదు. థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే, హై క్వాలిటీతో ఈ ఐ బొమ్మ (iBomma)సైట్‌లో ప్రత్యక్షమవుతుండటం మూవీ మేకర్స్‌కు మరోసారి పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో ఈ పైరసీ నెట్‌వర్క్ వెనుక మాస్టర్ మైండ్‌గా భావించిన ఇమ్మడి రవి అరెస్ట్ కావడంతో ఇలాంటి పైరసీ పని ఆల్మోస్ట్ అయిపోయిందనుకున్నారు.

అంతేకాదు అప్పట్లో ఇకపై తాము ఎటువంటి కంటెంట్ అప్‌లోడ్ చేయబోమని అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇవ్వడంతో టాలీవుడ్ మొత్తం ఊపిరి పీల్చుకుంది. అయితే, ఇలాంటి సమయంలోనే ఒకవైపు ప్రస్తుతం రవి బెయిల్‌పై బయట ఉండటం, మరోవైపు వెబ్‌సైట్ మళ్లీ లైవ్‌లోకి రావడం పెద్ద హాట్ టాపిక్ అయింది.

iBOMMA
iBOMMA

అసలు ఇప్పుడు ఈ వెబ్‌సైట్‌ను ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అన్నదే ఒక మిస్టరీగా మారింది. బెయిల్‌పై ఉన్న రవి మళ్లీ పాత మోడ్‌లోకి వెళ్లి ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా లేక బ్యాక్ ఎండ్ నుంచి వేరే ఎవరైనా ఈ వెబ్‌సైట్‌ను రన్ చేస్తున్నారా అన్న యాంగిల్‌లో సోషల్ మీడియాలో రకరకాల వెర్షన్స్ వినిపిస్తున్నాయి.

టెక్నికల్‌గా ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా, డొమైన్స్ మార్చుకుంటూ మళ్లీ మళ్లీ పైరసీ భూతం ఈ రూపంలో రావడం పోలీసులకు సవాల్‌గా మారింది. మొత్తానికి ఐబొమ్మ రీ-స్టార్ట్ అవ్వడం ఇటు ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న మూవీ లవర్స్‌లో జోష్ నింపినా.. అటు తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రం పైరసీ సెగలను మళ్లీ రాజేసినట్లు అయింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button