Just EntertainmentLatest News

Irumudi : మాస్ మహారాజా మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ .. ఇరుముడితో రవితేజ ఖాతాలో బ్లాక్‌బస్టర్ పడినట్లేనా?

Irumudi : ఫస్టాఫ్ అంతా సీలేరు అందాలు, అయ్యప్పస్వామి భక్తి పాటలు, తండ్రీకూతుళ్ల మధ్య బాండింగ్ సీన్లతో చకచకా సాగిపోతుంది. కానీ సెకండాఫ్ స్టార్ట్ అయ్యాక స్టోరీ పీక్స్‌కి వెళ్తుంది.

Irumudi

ఎప్పుడూ రొటీన్ మాస్ అండ్ కమర్షియల్ ఫార్ములాతో ఎంటర్‌టైన్ చేస్తూ వస్తున్న మాస్ మహారాజా రవితేజ.. ఈసారి కంప్లీట్ రూట్ మార్చి ఫుల్ ఎమోషన్ ఉన్న కథతో బాక్సాఫీస్ ముందుకు వచ్చేశారు. సక్సెస్‌ఫుల్ దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఇరుముడి (Irumudi) సినిమాపై అనౌన్స్‌మెంట్ నుంచే బిగ్ హైప్ వచ్చింది.

మూవీ స్టోరీ విషయానికి వస్తే.. సీలేరు పరిసరాల్లోని ఒక పల్లెటూర్లో త్రినాథ్ (రవితేజ) తన భార్య కావేరి (ప్రియా భవాని శంకర్), ముద్దుల కూతురు మణికంఠ (బేబీ నక్షత్ర)లతో చాలా హ్యాపీగా జీవిస్తుంటాడు. త్రినాథ్ అరటిపండ్ల వ్యాపారం చేసుకుంటూ ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాల ధరిస్తుంటాడు.

కూతురే ప్రాణంగా ఉండటంతో..ఆ అటాచ్మెంట్‌తో ఊర్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని చిన్నారి మణికంఠ తండ్రికి చెబుతూ ఉంటుంది. ఇలా ఎంతో ప్రశాంతంగా సాగిపోతున్న వీరి జీవితంలో ఊహించని తుపాన్ వస్తుంది. ఆ ఊళ్లో చదువుకునే అమ్మాయిలంతా ఒక్కొక్కరుగా వింత పరిస్థితుల్లో చనిపోతూ ఉంటారు.

ఈ మర్డర్ మిస్టరీకి సంబంధించిన కొన్నివిషయాలు చిన్నారి మణికంఠ కంట పడటంతో.. ఆ విలన్ల కన్ను త్రినాథ్ కుటుంబంపై పడుతుంది. ఆ తర్వాత త్రినాథ్ తన కూతురితో పాటు, ఊరిలోని మిగతా ఆడపిల్లలను ఆ కిరాతకుల నుంచి ఎలా కాపాడతాడు? ఈ సమయంలో మణికంఠకు ఎదురైన పరిస్థితులేంటనేదే ఈ ఇరుముడి అసలు స్టోరీ.

డైరెక్టర్ శివ నిర్వాణ ఒక కఠినమైన సోషల్ ట్రూత్‌ను ఈ మూవీలో చాలా ఎమోషనల్‌గా ప్రెజెంట్ చేశారు. సినిమా కమర్షియల్‌గా ఎంత కలెక్ట్ చేస్తుందనేది పక్కనబెడితే.. ఒక కంటెంట్ ఉన్న మూవీగా మాత్రం గ్యారెంటీగా ప్రశంసలు అందుకుంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలున్న తండ్రుల గుండెలను పిండేసే సీన్లు దీనిలో చాలా ఉన్నాయి.

ఫస్టాఫ్ అంతా సీలేరు అందాలు, అయ్యప్పస్వామి భక్తి పాటలు, తండ్రీకూతుళ్ల మధ్య బాండింగ్ సీన్లతో చకచకా సాగిపోతుంది. కానీ సెకండాఫ్ స్టార్ట్ అయ్యాక స్టోరీ పీక్స్‌కి వెళ్తుంది. ఆడపిల్లల మనసులో భయం ఉండకూడదని, వాళ్లను ధైర్యంగా పెంచాలనే ఒక స్ట్రాంగ్ పాయింట్‌ను రవితేజ వంటి మాస్ హీరోతో శివ నిర్వాణ పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేశారు. క్లైమాక్స్ అయితే ఆడియన్స్‌తో కన్నీళ్లు పెట్టిస్తుంది. స్లో పేస్ అండ్ కొన్ని లోపాలు ఉన్నా.. స్టోరీలోని సబ్‌స్టాన్స్ వాటిని కవర్ చేసేసింది.

Irumudi
Irumudi

రవితేజ తన కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ చేశారన్న టాక్ తెచ్చేసుకున్నారు. అయ్యప్ప భక్తుడిగా వేరియేషన్స్, ఎమోషనల్ సీన్లలో యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. చిన్నారి బేబీ నక్షత్ర తన క్యూట్ పెర్ఫార్మెన్స్‌తో థియేటర్లలో అందరి మనసులను దోచేసింది. ప్రియా భవాని శంకర్ తన రోల్‌లో సెటిల్డ్‌గా మెప్పించగా.. సాయికుమార్, అజయ్ ఘోష్ వంటి సీనియర్లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

మొత్తంగా చెప్పాలంటే ఇరుముడి(Irumudi) అనేది కేవలం ఒక క్రైమ్ ఎమోషనల్ డ్రామా మాత్రమే కాదు. అయ్యప్ప స్వామి బ్యాక్‌డ్రాప్‌లో కూతురిని ప్రొటెక్ట్ చేయడం కోసం నిలబడే ఒక సగటు తండ్రి పవర్‌ఫుల్ పోరాటంగా చెప్పొచ్చు. మెసేజ్ ఓరియెంటెడ్ విజువల్ వండర్‌గా వచ్చిన ఈ మూవీకి 3.75/5 రేటింగ్ ఇవ్వొచ్చు.

Antibiotics : ఫీవర్ రాగానే యాంటీబయాటిక్ మింగుతున్నారా?..అది మీ ఒంటికి డేంజరస్ పాయిజన్ అని తెలుసా

Related Articles

Back to top button