Just EntertainmentLatest News

Irumudi : ఇరుముడిని చుట్టుముట్టిన టీచర్ల వివాదం..డైరెక్టర్ రియాక్షన్‌తో రచ్చ ముగుస్తుందా?

Irumudi : ఇరుముడి సినిమాలో స్కూల్ పేరు వాడిన మాట నిజమే అయినా, అక్కడ ఒరిజినల్ లొకేషన్‌లో తాము షూట్ చేయలేదని శివ నిర్వాణ చెప్పారు.

Irumudi

మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ సినిమా ఇరుముడి(Irumudi) బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి ఓ రేంజ్‌ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. అయితే మరోవైపు ఏపీలో ఉపాధ్యాయ సంఘాల నుంచి మాత్రం ఈ సినిమాకు తీవ్రమైన నిరసన కాక తగులుతోంది.

గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థను, టీచర్ల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సీన్స్ రూపొందించారంటూ ఏపీ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్), యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) సంఘాలు రోడ్డెక్కడంతో వివాదం పెద్దదైంది. కాగా ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ పేరుతో ఒక రియల్ గవర్నమెంట్ స్కూల్ పేరును, వాళ్ల ఒరిజినల్ డ్రెస్ కోడ్‌ను డైరెక్ట్‌గా వాడటం కరెక్ట్ కాదంటూ టీచర్లకు కొంతమంది మద్దతుగా నిలబడుతున్నారు.

ఈ మూవీలో సర్కారీ బడి పిల్లలను, ఒక మహిళా టీచర్‌ని చాలా నెగిటివ్‌గా, చాలా క్రూయల్‌గా చూపించారనేది టీచర్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సీలేరు గవర్నమెంట్ హైస్కూల్‌ పేరును, అక్కడి ఒరిజినల్ స్కూల్ యూనిఫాంను మూవీలో ఏకంగా వాడేశారని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల మండిపడ్డారు.

ఓ టీచర్ పిల్లలను క్రూరంగా కొట్టడం, సాయంత్రం వరకూ క్లాస్ బయటే నిలబెట్టడం వంటి సీన్లు తమ గౌరవాన్ని  మట్టికరిపించేలా ఉన్నాయని, సొసైటీలోకి తప్పుడు మెసేజ్ వెళ్లకుండా ఆ వివాదాస్పద సీన్‌లను వెంటనే డిలీట్ చేయాలని టీచర్లు పట్టుబడుతున్నారు.

కాగా ఈ రచ్చపై స్పందించిన డైరెక్టర్ శివ నిర్వాణ.. తాను కూడా గతంలో ఎంఎస్సీ, బీఈడీ పూర్తి చేసి టీచర్‌గా పనిచేశానని గుర్తుచేస్తూ.. మూవీలో కేవలం ఒక్క టీచర్ క్యారెక్టర్‌ను మాత్రమే నెగిటివ్‌గా డిజైన్ చేశామని, మిగిలిన టీచర్ల పాత్రలను సొసైటీకి ఉపయోగపడేలా పాజిటివ్‌గానే తీశామని వివరణ ఇచ్చారు.

Irumudi
Irumudi

స్కూల్ పేరు వాడిన మాట నిజమే అయినా, అక్కడ ఒరిజినల్ లొకేషన్‌లో తాము షూట్ చేయలేదని చెప్పారు. మంచి చిత్రాలు అందించాలనే ఇండస్ట్రీకి వచ్చానని, ఈ విషయంపై ఇంతకంటే మాట్లాడటానికి ఏమీ లేదని అన్నారు.అయితే డైరెక్టర్ వ్యాఖ్యలతో టీచర్లు కూల్ అయినట్లు కనిపించడం లేదు.

గతంలో కూడా చాలా మూవీల్లో కొన్ని వృత్తుల పేరు లేదంటే గవర్నమెంట్‌ డిపార్ట్‌మెంట్స్ పేర్లు వాడినప్పుడు రీషూట్లు లేదా సీన్లు తొలగించడంతో వివాదాలు సద్దుమణగడం చూశాం. అయితే ఇరుముడి(Irumudi)లోని ఆ సీన్లను తొలగించే వరకు తమ పోరాటం ఆపేది లేదని టీచర్ల సంఘాలు గట్టిగా చెప్పడంతో.. ఈ మ్యాటర్ ఎటు తిరుగుతుందో చూడాలి మరి.

Team India : కొలంబో టెస్టులో మ్యాచ్ మార్చిన దినూష..చివరి టెస్ట్ డ్రా.. సిరీస్ టీమిండియా సొంతం ..

Related Articles

Back to top button