Linen
యంగ్ హీరో అఖిల్ అక్కినేని కెరీర్‌లో లెనిన్(Linen) మూవీ ఒక అతిపెద్ద మైలురాయిగా నిలిచేలా కనిపిస్తోంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఒక సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు, ఈ లెనిన్ కొత్త ఊపును ఇచ్చింది.
జూలై 10న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్స్ కూడా బాగా కుదరడంతో ఆడియన్స్ ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు.
గతంలో అఖిల్ నటించిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, ఏజెంట్ వంటి మూవీలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. కేవలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ మాత్రమే కొంతవరకు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో అయ్యగారి కెరీర్‌లో ఒక పక్కా కమర్షియల్ బ్రేక్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.
ఆ నిరీక్షణకు తెరదించుతూ లెనిన్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ..మొదటి రోజే సుమారు 16.7 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 61.1 కోట్ల మార్కును దాటేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇది అఖిల్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూవీగా నిలిచింది.
ఈ మూవీ ఇంత పెద్ద విజయాన్ని సాధించడానికి మెయిన్ రీజన్ మురళీ కిషోర్ అబ్బూరు అద్భుతమైన స్క్రీన్‌ప్లే అనే చెప్పొచ్చు. అఖిల్‌ను ఇప్పటివరకు చూడని ఒక పవర్‌ఫుల్ మాస్ లుక్‌లో చూపించడం, స్టోరీలో ఊహించని ట్విస్టులు ఉండటం ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో.. మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నాగార్జున అక్కినేని , సూర్యదేవర నాగవంశీ లెనిన్ మూవీని ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకువెళ్లడం కూడా దీని సక్సెస్‌కు కారణమే.
లెనిన్ రిలీజ్అయిన ఫస్ట్ డే నుంచే సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వడం కూడా కలెక్షన్లు స్పీడ్‌గా పెరగడానికి కారణమైంది. మూవీ యూనిట్ చేసిన ప్రమోషన్స్, టైమ్‌లీ కలెక్షన్ పోస్టర్స్ ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని పెంచాయి.
లెనిన్(Linen) మూవీ అఖిల్ కెరీర్‌కు కేవలం ఒక సక్సెస్ మాత్రమే కాదని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో అఖిల్ మార్కెట్‌ను మరింత పెంచే ఒక గొప్ప రిడెంప్షన్ మూవీగా నిలిచిపోతుందని జోస్యం చెబుతున్నారు.
What a way to end the first weekend 🔥
The audience embraced it ❤️
The box office celebrated it 💥#LENIN Crossed 61.1 CR+ Worldwide Gross in just 3 Days ❤️🔥#BlockbusterLENIN 🌋 @AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu @MusicThaman @pramodactor1… pic.twitter.com/m1XnvP9Cki— Sithara Entertainments (@SitharaEnts) July 13, 2026
Dal : పప్పు వండేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారా?.. టేస్ట్, పోషకాలు మిస్ కాకుండా ఉండాలా?
