Dragon: తారక్ బర్త్ డే బ్లాస్టింగ్ .. మైండ్ బ్లోయింగ్‌గా డ్రాగన్ గ్లింప్స్
Dragon : మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ మూవీ యూనిట్ అర్ధరాత్రి వేళ పవర్ఫుల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది.
Dragon
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మూవీ డ్రాగన్(Dragon) అఫీషియల్ గ్లింప్స్ రిలీజ్ అయి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. RRR సినిమాతో ఇంటర్నేషనల్ రేంజ్లో క్రేజ్ తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత దేవరతో పలకరించినా సరే.. మాస్ ఆడియన్స్‌కు ఒక పర్ఫెక్ట్ హై-వోల్టేజ్ యాక్షన్ ఫీస్ట్ మిస్ అయిందనే ఫీలయ్యారు.
అలాంటి టైమ్‌లోనే ప్రశాంత్ నీల్ లాంటి మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్‌తో తారక్ సినిమా అనగానే అంచనాలు ఆకాశానికి చేరిపోయాయి. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను 2027 జూన్ 11గా అనౌన్స్ చేశారు. మధ్యలో అప్ డేట్స్ ఏమీ రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయ్యారు. కానీ మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ మూవీ యూనిట్ అర్ధరాత్రి వేళ ఈ పవర్ఫుల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది.
ఈ సరికొత్త గ్లింప్స్ విజువల్స్ చూస్తుంటే ప్రశాంత్ నీల్ తన మార్క్ డార్క్ థీమ్‌తో మరో అద్భుతమైన కొత్త వరల్డ్‌ను క్రియేట్ చేసినట్లు క్లియర్ గా అర్థమవుతోంది. ఈ మూవీ స్టోరీ బ్యాక్‌డ్రాప్ మనకి స్వాతంత్య్రం రాకముందు, అంటే బ్రిటిష్ వాళ్లు భారత దేశానికి వచ్చిన కాలంలో మొదలవుతుంది.
డ్రాగన్ (Dragon)స్టోరీ మొత్తం హెరాయిన్ అనే డ్రగ్స్ మాఫియా చుట్టూ తిరగనున్నట్లు తెలుస్తోంది. వివిధ దేశాల సరిహద్దుల్లో జరిగే డ్రగ్ ట్రేడింగ్, దాని కోసం జరిగే గ్యాంగ్ వార్స్ ఈ మూవీలో మెయిన్ హైలైట్ కానున్నాయి. ముఖ్యంగా ఈ స్టోరీ లైన్ అంతా ఆఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ ,గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ అనే రెండు పెద్ద మాఫియా సామ్రాజ్యాల మధ్య జరిగే పవర్ఫుల్ ఫైట్లా ఉండబోతోంది.
దీనిలో ఎన్టీఆర్ ఆఫ్గాన్ కంపెనీ తరఫున ప్రత్యర్థులను వేటాడే లూగర్ అనే ఒక డేంజరస్ క్యారెక్టర్లో కనిపించబోతుండటం హైలెట్‌గా నిలుస్తోంది.ట్రైలర్ లో వినిపించే డైలాగ్స్‌ని బట్టి ఈ మూవీలో నీతిగా ఉండే హీరోలు ఎవరూ ఉండరని, అందరూ విలన్లే అని హింట్ ఇచ్చేశారు. అంటే ఎన్టీఆర్ పాత్ర కూడా కంప్లీట్ నెగిటివ్ షేడ్స్‌తో పాటు గ్రే క్యారెక్టరైజేషన్‌తో ఊహించని రేంజ్లో ఉండబోతోందని తెలుస్తోంది.
మొత్తంగా డ్రాగన్(Dragon )లో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌ను ఒక సరికొత్త విలనిజం ఉన్న ప్రోటాగోనిస్ట్గా చూపించబోతున్నారనే వార్త మాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఈ గ్లింప్స్ లో చూపించిన యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉండి మూవీపై అంచనాలను డబుల్ చేసేశాయి.

స్టార్ కాస్టింగ్ పరంగా కూడా ఈ డ్రాగన్ మూవీ చాలా రిచ్‌గా ఉండబోతోంది. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ అనిల్ కపూర్, సీనియర్ నటి ఖుష్బూ సుందర్, వర్సటైల్ యాక్టర్ గురు సోమసుందరం ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.
వీరితో పాటు రాజీవ్ కనకాల, అశుతోష్ రానా, అంశుమాన్ పుష్కర్, సిద్ధాన్త గుప్తా, ప్రభాస్ శ్రీను, శత్రు వంటి యాక్టర్లతో పాటు కొంతమంది ఇంటర్నేషనల్ నటులు కూడా ఈ మూవీలో నటిస్తున్నారు. మొత్తానికి ఈ తారక్ బర్త్ డే గ్లింప్స్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకలి తీరడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద డ్రాగన్ క్రియేట్ చేయబోయే విధ్వంసానికి ఇదొక చిన్న శాంపిల్ మాత్రమేనని సినిమా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
Araku Valley: ప్రకృతి ఒడిలో అద్భుత ప్రపంచం ..సమ్మర్లో అరకు లోయ ట్రిప్‌కు వెళుతున్నారా?





