Mokshagna:మోక్షజ్ఞ కోసం నారా లోకేష్ రంగంలోకి దిగుతున్నారా? 2 స్టోరీలు కూడా రెడీగా ఉన్నాయా?

Mokshagna: మోక్షజ్ఞ గురించి ఏదో ఒక వార్త ప్రచారంలోకి రావడం, ఆ తర్వాత అది ఆగిపోయింది అన్న న్యూస్ వచ్చేసరికి అభిమానుల్లో అసంతృప్తి నెలకొంటుంది.

Mokshagna

నందమూరి నటవారసుడు, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ(Mokshagna) వెండితెర అరంగేట్రం ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని నందమూరి అభిమానులు కొన్నేళ్లుగా వెయిట్ చేస్తున్నారు. గతేడాది డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందంటూ అధికారికంగా ప్రకటించినా, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు.

ఆ ఎఫెక్ట్‌తోనే ఇప్పుడు మళ్లీ మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ గురించి ప్రచారం జరుగుతున్నా, ఆడియన్స్ మాత్రం పెద్దగా నమ్మడం లేదు. ఎందుకంటే ఇప్పటికే నందమూరి మోక్షజ్ఞ వయసు ముప్పై ఏళ్లకు చేరుకుంది.

ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా, నిలదొక్కుకోవడానికి మరో ఐదేళ్ల సమయం అయినా పడుతుంది. ఆ తర్వాత ఎలాంటి కథలను ఎంచుకుంటారు..అసలు బాలకృష్ణలా పేరు తెచ్చుకోగలరా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి మోక్షజ్ఞ(Mokshagna) కు సినిమాల్లో యాక్ట్ చేయడం ఇష్టం లేకపోతే ఆ విషయాన్ని బాలకృష్ణకు డైరెక్టుగా చెప్పేసి పక్కకు తప్పుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ అలా కాకుండా ప్రతిసారి మోక్షజ్ఞ గురించి ఏదో ఒక వార్త ప్రచారంలోకి రావడం, ఆ తర్వాత అది ఆగిపోయింది అన్న న్యూస్ వచ్చేసరికి అభిమానుల్లో అసంతృప్తి నెలకొంటుంది.

అయితే దీనివల్ల అటు ఫ్యాన్స్‌తో పాటు నందమూరి కుటుంబంలో కూడా కొంత అసంతృప్తి కలిగినట్లు తెలుస్తోంది.దీంతో మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ బాధ్యతలను బావ నారా లోకేష్ తన భుజాలపై వేసుకున్నట్లు ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఒక న్యూస్ వైరల్ అవుతోంది.

తన బావమరిదిని ఎలాగైనా హీరోగా నిలబెట్టడానికి గట్టి పట్టుదలతో లోకేష్ స్వయంగా రంగంలోకి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు లోకేష్ స్వయంగా ఒక రెండు వైవిధ్యమైన స్టోరీలను విని, మోక్షజ్ఞ కోసం ఫైనల్ చేసి పెట్టారనే టాక్ నడుస్తోంది.

Mokshagna

అయితే లోకేష్ ఎంపిక చేసిన ఆ స్టోరీల్లో యాక్ట్ చేయడానికి మోక్షజ్ఞ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అలాగే ఆ సినిమాలకు డైరెక్షన్ చేసే దర్శకులు ఎవరనే సస్పెన్స్ కూడా కొనసాగుతోంది.

అయితే మోక్షజ్ఞ(Mokshagna) సినీ ఎంట్రీ కోసం అదిగో ఇదిగో అన్న వార్తలతో ఇప్పటివరకు నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఓపికగా ఎదురుచూశారు. కానీ, ఇకపై కూడా ఆలస్యం చేస్తే విమర్శలు వచ్చే ప్రమాదముంది. ఇప్పటికైనా మోక్షజ్ఞ తన ఎంట్రీపై సీరియస్‌గా ఆలోచించి ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Gold Rates : పసిడి ప్రియులకు షాక్..యుద్ధ భయంతో మళ్లీ పెరిగిన ధర

Exit mobile version