Just Entertainment

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మాస్ వైబ్స్ స్టార్టింగ్స్..

Pawan Kalyan :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఓజీ' (OG) సినిమా నుంచి మొదటి పైర్ పేలబోతోంది.

Pawan Kalyan :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఓజీ’ (OG) సినిమా నుంచి మొదటి పైర్ పేలబోతోంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ గ్యాంగ్‌స్టర్ డ్రామా నుంచి, ప్యాన్స్ అంచనాలను ఆకాశానికి చేర్చేలా, మొదటి పాట ‘ఫైర్ స్టోర్మ్’ ఆగస్టు మొదటి వారంలో విడుదల కానుంది.

Pawan Kalyan

ఎస్.ఎస్. థమన్ మ్యూజిక్, కోలీవుడ్ స్టార్ శింబు వాయిస్‌తో ఈ పాట థమన్ కెరీర్‌లోనే బెస్ట్ ట్రాక్‌లలో ఒకటిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఫైర్ స్టోర్మ్’ కేవలం పాట మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ పాత్రకు ఒక స్టైలిష్ ఎంట్రీ అని, ముంబై మాఫియా బ్యాక్ గ్రౌండ్‌తో సాగే ఈ చిత్రంలో పవన్ రౌడీ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాల్లో బిజీగా ఉన్నా కూడా, ఈ పాట విడుదలతో ‘ఓజీ’ ప్రమోషన్స్ ఊపందుకోనున్నాయి. నిజానికి, దసరాకు ప్రమోషన్స్ మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేసినా, ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆగస్టులోనే ఈ ‘ఫైర్ స్టోర్మ్’ను రగిల్చాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

పాటలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ అభిమానులను మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు.అలాగే యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా హైలైట్‌గా ఉంటాయని టాక్. సుజిత్ ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన జపనీస్ టచ్ ఇచ్చారని.. అది పవన్ స్వాగ్‌కి పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుందని చెబుతున్నారు. 2025 సెప్టెంబర్ 25న విడుదల కానున్న ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తుందో చూడాలి.

 

Related Articles

Back to top button