Peddi : వీకెండ్ లోపు రూ.200 కోట్లు ..రెండో రోజు పెద్ది కలెక్షన్లు ఎంతంటే ?

Peddi : రెండో రోజు కూడా పెద్ది మూవీ మంచి వసూళ్లు రాబట్టింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రెండోరోజు 31 శాతం ఆక్యుపెన్సీతో రూ.25 కోట్ల వరకూ కలెక్షన్లు సాధించింది

Peddi

మెగాపవర్ స్టార్ రామచరణ్ పెద్ది(Peddi) సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నిన్న విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటోంది. తొలిరోజే రూ.135 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆంధ్ర తెలంగాణలో రూ.55 కోట్లు నెట్ కలెక్షన్లు చేయగా, రూ.72 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

కర్ణాటకలో రూ.5.75 కోట్లు, తమిళనాడులో రూ.2 కోట్లు, కేరళలో రూ.50 లక్షలు, నార్త్ ఇండియా, సెంట్రల్ ఇండియాలో రూ.6 కోట్ల వరకూ వసూలు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో పెద్ది(Peddi) సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.

తొలిరోజే ఓవర్సీస్‌లో సుమారు రూ.30 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. మొత్తం మీద తొలిరోజే రూ.100 కోట్ల క్లబ్ లో చేరి బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల సరసన నిలిచింది. ఇప్పుడు రెండో రోజు కూడా పెద్ది మూవీ మంచి వసూళ్లు రాబట్టింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రెండోరోజు 31 శాతం ఆక్యుపెన్సీతో రూ.25 కోట్ల వరకూ కలెక్షన్లు సాధించింది. దీంతో రెండు రోజులకే పెద్ది మూవీ కలెక్షన్లు రూ.150 కోట్లు దాటేసాయి. దీంతో ఈ వీకెండ్ లోపు రూ.200 కోట్ల క్లబ్ చేరడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాను నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్, జగపతిబాబు, హిందీ నటుడు దివ్యేందు శర్మ, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్ వంటి స్టార్లు నటించారు.

Peddi

స్పోర్ట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి రామ్ చరణ్ నటన హైలైట్ గా నిలిచింది. క్రికెట్ , కుస్తీ, అథ్లెట్ గా అద్భుతమైన నటన కనబరిచాడు. ఈ సినిమా కోసం చెర్రీ తన శరీరాన్ని మార్చుకున్న తీరుపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. విమర్శకులను కూడా ఆకట్టుకున్న ఈ మూవీలో కొంత సాగదీత కథ ఉన్నా సరే ఓవరాల్ గా మేజర్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో పెద్ది(Peddi) సక్సెస్ అయ్యాడు.

ముఖ్యంగా చెర్రీ యాక్షన్‌, జగపతిబాబు నటన, ఏఆర్ రెహమాన్ బీజీఏం సినిమాను నిలబెట్టాయని చెబుతున్నారు. సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు తన దర్శకత్వ ప్రతిభతో రామ్ చరణ్ నుంచి మంచి నటన రాబట్టుకుని హిట్ ఇచ్చాడంటూ మెగా ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

YS Jagan : ఏపీ లిక్కర్ స్కామ్ ..జగన్‌కు ఈడీ నోటీసులు ?

Exit mobile version