Sai Durgha Tej-Teja Sajja : పెళ్లి పీటలు ఎక్కబోతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్.. సాయిదుర్గా తేజ్, తేజ సజ్జా మ్యారేజ్ రూమర్స్

Sai Durgha Tej-Teja Sajja : మెగా హీరో సాయిదుర్గా తేజ్ , యంగ్ హీరో తేజ సజ్జా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న వీరి పెళ్లి మ్యాటర్ గురించి పూర్తి వివరాలు చూద్దాం..

Sai Durgha Tej-Teja Sajja

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇద్దరు యంగ్ హీరోల పెళ్లి గురించే హాట్ హాట్‌గా చర్చ నడుస్తోంది. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్(Sai Durgha Tej-Teja Sajja) ఇద్దరూ కూడా.. త్వరలోనే ఒక ఇంటివారు కాబోతున్నారనే వార్తలు సినీ సర్కిల్‌లో రౌండ్లు కొడుతున్నాయి.

వీరిలో ముందుగా మెగా హీరో సాయిదుర్గా తేజ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. నవంబర్‌లోనే తేజ్ వివాహం జరగనుందని, నవంబర్ 5న నిశ్చితార్థం జరగొచ్చని టాలీవుడ్ వర్గాల్లో గట్టిగానే న్యూస్ వినిపిస్తోంది.

వధువు ఈ మెగాహీరో చిన్ననాటి స్నేహితురాలే అని, పెద్దల అంగీకారంతోనే ఈ పెళ్లి అత్యంత నిరాడంబరంగా, కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో మాత్రమే జరగనుందని తెలుస్తోంది. ఇక సినిమాల పరంగా సాయి దుర్గా తేజ్ ప్రస్తుతం సంబరాల ఏటి గట్టు మూవీతో అతి త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానున్నారు.

మరోవైపు హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలోనూ తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జా మ్యారేజ్ కూడా త్వరలోనే జరగబోతుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నవంబర్‌లోనే తేజ నిశ్చితార్థం ఉంటుందని.. పెళ్లి మాత్రం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా డిసెంబర్ నెలలో అంగరంగ వైభవంగా జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Sai Durgha Tej-Teja Sajja

తేజ సజ్జా కాబోయే భార్య సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని, ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అనే టాక్ వినిపిస్తోంది.ప్రస్తుతం తేజ సజ్జా వరుసగా మిరాయ్ 2 అలాగే ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో జాంబిరెడ్డి 2 మూవీలతో పాటు ఓటీటీలో రియాలిటీ షో హోస్ట్‌గా ఫుల్ బిజీగా ఉన్నాడు.

అయితే ఈ పెళ్లి వార్తలపై ఇప్పటివరకు ఈ ఇద్దరు(Sai Durgha Tej-Teja Sajja) హీరోలు కానీ వీరి కుటుంబాలు , సన్నిహితులు ఎవరూ కూడా అధికారికంగా స్పందించలేదు. త్వరలోనే వీరు తమ పెళ్లి వార్తను ఫ్యాన్స్‌తో పంచుకుంటారన్న వార్తలు మాత్రం విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Over Thinking : అతిగా ఆలోచిస్తున్నారా? అవతలి వారి మైండ్‌సెట్‌ను కూడా మీరే చదివేస్తున్నారా?

↑
Exit mobile version