Just EntertainmentLatest News

Peddi : పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు పూర్తి.. చీఫ్‌ గెస్ట్‌గా ఆ హీరో వస్తున్నారా?

Peddi : ఒక పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ భారీ మూవీని వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి.

Peddi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , క్రేజీ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో భారీ అంచనాలతో వస్తున్న పెద్ది సినిమాపై టాలీవుడ్‌లో క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, పోస్టర్స్, పాటలు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.

ఒక పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ భారీ మూవీని వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి.

ఇక సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న సమయంలో పెద్ది (Peddi) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ చక్కర్లు కొడుతోంది. జూన్ 2వ తేదీన హైదరాబాద్‌లో ఈ వేడుకను చాలా గ్రాండ్‌గా, కంటిపాప కాన్సెప్ట్‌ తో భారీ సెటప్‌తో నిర్వహించడానికి మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోందట.

ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేలా, టాలీవుడ్‌లోని ప్రముఖ స్టార్స్ అందరినీ ఒకే వేదికపైకి తెచ్చేలా ఈ ఈవెంట్‌ను ఒక పెద్ద పండుగలా చేయాలని మైత్రి మూవీ మేకర్స్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఈవెంట్‌కు సంబంధించిన అసలైన హైలైట్ ఏంటంటే.. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఇన్వైట్ చేయాలని మేకర్స్ గట్టిగా అనుకుంటున్నారట.

Peddi
Peddi

ఈ మధ్య కాలంలో మెగా అండ్ అల్లు ఫ్యామిలీస్ మధ్య జరుగుతున్న చర్చల మధ్య, రామ్ చరణ్ ఈవెంట్‌కు బన్నీ గెస్ట్‌గా వస్తే ఆ క్రేజ్ ఎలా ఉంటుందోనని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. పైగా మెగా పవర్‌స్టార్, ఐకాన్ స్టార్ ఇద్దరినీ ఒకే స్టేజ్‌పై చూసే అదృష్టం అభిమానులకు దక్కుతుంది.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతూ ఫ్యాన్స్‌లో ఎగ్జైట్‌మెంట్‌ను పీక్స్‌కు తీసుకెళ్తోంది. దీనిపై పెద్ది(Peddi) మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే జూన్ 2న టాలీవుడ్‌లో ఒక బిగ్గెస్ట్ సెలబ్రేషన్ చూడబోతున్నామని మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Ice Bath :ఐస్ బాత్ అందరికీ మంచిదేనా? ఐస్ వాటర్ స్నానాలు నిజంగానే ఆరోగ్యానికి మంచివా?

Related Articles

Back to top button