Prabhas : డార్లింగ్ ప్రభాస్ బర్త్‌డే..రాజు గారి రేంజ్ వేరే లెవెల్ ..
Prabhas : పాన్ ఇండియా ఇండియన్ మూవీ బాక్సాఫీస్ సుల్తాన్, రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా డార్లింగ్ 24 ఏళ్ల సినీ ప్రయాణం, వెయ్యి కోట్ల రికార్డులు, రాబోయే స్పిరిట్, ఫౌజీ, కల్కి 2 లైనప్ విశేషాలు తెలుసుకోండి.
Prabhas
ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర డార్లింగ్ పేరు వింటేనే థియేటర్లు దద్దరిల్లిపోయే రేంజ్ మానియా ప్రభాస్(Prabhas) సొంతం. ఒకప్పుడు రీజనల్ మూవీగా ఉన్న టాలీవుడ్‌ను ఏకంగా గ్లోబల్ మ్యాప్‌పై పెట్టి, ఇండియన్ బాక్సాఫీస్ బౌండరీలను పర్మినెంట్‌గా తుడిచేసిన క్రెడిట్.. డార్లింగ్ ప్రభాస్‌దే.
ఈశ్వర్ మూవీతో మొదలైన ఈ కటౌట్ సిల్వర్ స్క్రీన్ జర్నీ.. ఈరోజుతో 24 ఏళ్ల సుదీర్ఘ గ్రాండ్ హిస్టరీని పూర్తి చేసుకుంది. స్టార్‌డమ్ పరంగా ఎంత ఎత్తుకు ఎదిగినా, బాక్సాఫీస్ రికార్డులను బొమ్మ చూపిస్తూ ఛత్రపతిలా దున్నేస్తున్నా.. పర్సనల్‌గా ప్రతీ ఒక్కరినీ ప్రేమిస్తూ పిలిచే ఆ డార్లింగ్ అనే ఒకే ఒక్క మాట ప్రభాస్ బంగారు మనస్సుకు అద్దం పడుతుందంటారు సన్నిహితులు. అందుకే బాక్సాఫీస్ వద్ద బడా స్టార్‌గా, అభిమానుల గుండెల్లో ఆత్మీయ మనిషిగా ప్రభాస్ అందరివాడిలా కలిసి పోతుంటారు.
పాన్ ఇండియా అనే వర్డ్‌కు అసలైన బెంచ్ మార్క్ సెట్ చేసిన ప్రభాస్ క్రేజ్.. ఇప్పుడు దేశ బౌండరీలు దాటి జపాన్, యుఎస్, యూకే వరకు పాకేసింది. తమిళ, మలయాళ, కన్నడ నుంచి నార్త్ నార్త్ బెల్ట్ వరకు స్టార్ హీరోలకు పోటీగా బాలీవుడ్ కలెక్షన్ల రికార్డులు క్రాష్ చేయడం ప్రభాస్(Prabhas)కు అలవాటుగా మారిపోయింది.
బాహుబలి 2, కల్కి 2898 ఏడి మూవీలతో వరుసగా రెండుసార్లు బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కు దాటిన ఏకైక భారతీయ హీరోగా ప్రభాస్ ఆల్ టైమ్ రికార్డ్‌ను ఎప్పుడో సెట్ చేశారు. అంతేకాదు, ఓవర్సీస్ మార్కెట్‌లో 10 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించిన ఫస్ట్ ఇండియన్ స్టార్‌గా.. రికార్డుల రారాజుగా జెండా పాతేశారు. డిజిటల్, శాటిలైట్, థియేట్రికల్.. ఇలా ఏ బిజినెస్ తీసుకున్నా, ప్రొడ్యూసర్లకు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలను తెచ్చిపెట్టే బిగ్గెస్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రభాస్ అంటారు ఆయన ఫ్యాన్స్.
కేవలం సిల్వర్ స్క్రీన్ పైనే కాదు .. రియల్ లైఫ్‌లోనూ ప్రభాస్ హీరోనే. డ్రగ్స్ వాడొద్దని సోషల్ అవేర్‌నెస్ యాడ్ చేయడం దగ్గర నుంచి, ఏవైనా ప్రకృతి విపత్తులు సంభవించి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు భారీ విరాళాలుగా ఇచ్చే రాజా మనసు కూడా ఆయన సొంతం.
ఆయనతో వర్క్ చేసిన ప్రతీ యాక్టర్, టెక్నీషియన్ డార్లింగ్ అభిమానిగా మారిపోతారు. రీసెంట్‌గా నాగ్ అశ్విన్ డైరెక్టర్స్ విజన్‌ను గుడ్డిగా ఫాలో అయ్యే ప్రభాస్ వంటి గ్రేట్ స్టార్ దొరకడం తన అదృష్టమని ఓపెన్‌గానే చెప్పారు.
ఇక రాబోయే రోజుల్లో ప్రభాస్(Prabhas) లైనప్ చూస్తే మతులు పోవాల్సిందే. సందీప్ వంగా డైరెక్షన్‌లో వస్తున్న ‘స్పిరిట్’ 2027 దీపావళి ధమాకాగా రానుండగా, హను రాఘవపూడి కాంబోలో వస్తున్న భారీ పీరియాడిక్ డ్రామా ఫౌజీ 2027 సమ్మర్ రిలీజ్‌కు ల్యాండ్ కాబోతోంది.
దీనికి తోడు గ్రాండ్ షూటింగ్ జరుపుకొంటున్న కల్కి 2 , త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న సలార్ 2 మూవీలతో ప్రభాస్ రాబోయే ఐదేళ్ల పాటు ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏలడానికి కంప్లీట్ స్కెచ్ వేసేశారు. ఇలాంటి అన్ స్టాపబుల్ హిట్స్‌ను ఇంకా ఎన్నోఇవ్వాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్‌డే టు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్.





