Fauzi : ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. మాస్ పోస్టర్‌తో ఫౌజీ ..రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
Fauzi : ప్రభాస్ షర్ట్ లేకుండా, బాడీ అంతా బ్లడ్తో తడిసిపోయి, ఒక పెద్ద ఫైట్ ముగించుకుని అలిసిపోయి కూర్చున్నట్లుగా కనిపిస్తున్న ఈ లుక్.. నెక్స్ట్ లెవెల్లో ఉంది.
Fauzi
రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఏ రేంజ్లో వెయిట్ చేస్తున్నారో చెప్పక్కర్లేదు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై.. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి ప్రభాస్ హీరోగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. లవ్ అండ్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక వింటేజ్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది.
ఈ మూవీలో(Fauzi) ప్రభాస్ ఒక పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ లుక్‌లో కనిపించబోతున్నాడనే న్యూస్ మొదటి నుంచీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ మూవీపై ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ రాకపోయినా, ఈ కాంబినేషన్ అనౌన్స్ అయిన రోజు నుంచే అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిపోయాయి.
ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ మూవీని ఆగస్టు నెలలోనే థియేటర్లలోకి తీసుకురావాలని టీమ్ భావించింది. కానీ, షూటింగ్ ఆలస్యం అవడంతో.. అనుకున్న సమయానికి పనులు పూర్తి కాలేదు. దీంతో ఈ మూవీ పోస్ట్‌పోన్ అవుతూ వస్తుండటంతో అప్డేట్ కోసం కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసిన ఫ్యాన్స్‌కు మేకర్స్ ఇప్పుడు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు.
అన్ని పనులను పూర్తి చేసుకుని, ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని డిసెంబర్ 3వ తేదీన వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ వదిలిన వైల్డ్ అండ్ రా పోస్టర్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. దీనిలో ప్రభాస్ షర్ట్ లేకుండా, బాడీ అంతా బ్లడ్తో తడిసిపోయి, ఒక పెద్ద ఫైట్ ముగించుకుని అలిసిపోయి కూర్చున్నట్లుగా కనిపిస్తున్న ఈ లుక్.. నెక్స్ట్ లెవెల్లో ఉంది.

ఆ స్టాంప్‌పై అజ్ఞాతపర్వం.. మోస్ట్ వాంటెడ్ 1932 నుంచి అని రాసి ఉండటం ఇప్పుడు నెట్టింట నయా చర్చకు దారి తీసేలా చేసింది. దీన్ని బట్టి చూస్తే ఈ స్టోరీ లైన్ భారత దేశానికి స్వాతంత్ర్యం రాకముందు, అంటే 1930 వ నాటి వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పవర్ఫుల్ యాక్షన్ డ్రామా అని అర్థమవుతోంది.
अज्ञातपर्व ENDS.
THE REBELLION BEGINS 🔥#Fauzi GRAND RELEASE WORLDWIDE ON 3rd DECEMBER 2026 ❤🔥#FauziOnDec3Rebel Star #Prabhas#Imanvi @hanurpudi #MithunChakraborty #JayaPrada @AnupamPKher @Composer_Vishal @sudeepdop @kk_lyricist @MrSheetalsharma @rckamalakannan… pic.twitter.com/EBeYKkNsjo
— Mythri Movie Makers (@MythriOfficial) July 16, 2026





