Just EntertainmentJust Andhra PradeshLatest News

Peddi Premier Shows:పెద్ది మూవీకి గ్రీన్ సిగ్నల్.. జూన్ 3న ప్రీమియర్ షో.. రోజుకు 5 షోలు..

Peddi Premier Shows: రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత చెర్రీ సినిమా కావడంతో.. పెద్ది సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Peddi Premier Shows

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, క్రేజ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ.. పెద్ది కోసం వరల్డ్ వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత చెర్రీ సినిమా కావడంతో.. దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఈ మూవీ రిలీజ్‌కు ముందే ఒక క్రేజీ అప్‌డేట్ అఫీషియల్‌గా బయటకు వచ్చింది. జూన్ 3వ తేదీన జరగబోయే ఈ సినిమా ప్రీమియర్ షో(Peddi Premier Shows)లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు అధికారిక అనుమతులు లభించాయి.

సాధారణంగా పెద్ద మూవీకి రిలీజ్ రోజు తెల్లవారుజామున షోలు ప్రదర్శించడానికి గవర్నమెంట్‌ నుంచి ప్రత్యేక అనుమతులు కావాలి. అయితే పెద్ది సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం జూన్ 3 వ తేదీ మిడ్ నైట్ నుంచే దేశంలోనే మొట్టమొదటి ప్రీమియర్ షోలు వేసుకోవడానికి అఫీషియల్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

ప్రభుత్వ నిర్ణయంతో రోజుకు 5 షోలు పడనుండటంతో..మెగా ఫ్యాన్స్ హడావుడి అప్పుడే మొదలైందని, ఓపెనింగ్స్ పరంగా ఇది నయా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పెద్ది మూవీకి ప్రత్యేక షోలతో పాటు టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ జీవో కూడా జారీ చేసింది. ఈ నిర్ణయం నిర్మాతలకు , డిస్ట్రిబ్యూటర్లకు భారీ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించడంలో ఎంతో ప్లస్ కానుంది.

రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిన తర్వాత వస్తున్న సోలో మూవీ కావడంతో నైజాం, ఆంధ్రా , తెలంగాణ అనే తేడా లేకుండా అన్ని ఏరియాల థియేట్రికల్ రైట్స్ రికార్డు స్థాయి ధరలకు అమ్ముడయిపోయాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ అర్ధరాత్రి ప్రీమియర్ షో(Peddi Premier Shows)ల టాక్ కనుక బాగుంటే, మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Peddi Premier Shows
Peddi Premier Shows

రంగస్థలంలో చిట్టిబాబుగా మ్యాజిక్ చేసిన చెర్రీ, ఈ సినిమాలో కూడా ఒక డిఫరెంట్ అండ్ పవర్‌ఫుల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. జూన్ 3న పడబోయే ఈ అఫీషియల్ ప్రీమియర్ షోల ద్వారానే రామ్ చరణ్ సరికొత్త క్యారెక్టరైజేషన్ పై ఆడియన్స్‌కు పూర్తి క్లారిటీ రానుంది.

ఈ ప్రీమియర్ షోల టాక్ మూవీ లాంగ్ రన్‌ను పూర్తిగా శాసించబోతోంది. ఒకవేళ అర్ధరాత్రి షోల నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తే, మొదటి వీకెండ్ లోనే ఈ మూవీ సగం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button