Ram Charan :బుచ్చిబాబుపై రామ్ చరణ్ సెటెర్లు.. వీడియోను షేర్ చేసి మరీ ర్యాగింగ్ చేసిన చెర్రీ
Ram Charan :మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. సానా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ పెద్ది.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడానికి రెడీ అవుతోంది
Ram Charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. సానా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ పెద్ది.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడానికి రెడీ అవుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ భారీ బడ్జెట్ మూవీ నుంచి తాజాగా ఒక క్రేజీ అప్డేట్ బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోతున్నారు.
ఓవైపు షూటింగ్ క్లైమాక్స్ దశకు చేరుకోవడంతో..మేకర్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరోవైపు డబ్బింగ్ పనులను కూడా మొదలుపెట్టేశారు.అలా డబ్బింగ్ స్టూడియో నుంచి చెర్రీ.. షేర్ చేసిన ఒక ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో డైరెక్టర్ బుచ్చిబాబును రామ్ చరణ్(Ram Charan ) ఆటపట్టించిన తీరు మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా అలరిస్తోంది.
నిజానికి పెద్ది సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచే.. అంచనాలు ఆకాశాన్ని టచ్ చేస్తున్నాయి. ఫస్ట్ గ్లిమ్స్ రిలీజయ్యాక ఆ క్రేజ్ రెట్టింపు అవ్వగా, ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన చికిరి చికిరి పాట అయితే ఏకంగా సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు సెకండ్ సింగిల్ ‘రై రై రారా’ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సాంగ్ రిలీజ్‌కు రంగం సిద్ధం చేస్తూనే, చరణ్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించారు. స్టూడియోలో ఏమది అంటూ గంభీరమైన డైలాగ్ చెబుతుంటే, పక్కనే ఉన్న బుచ్చిబాబు ఫిదా అయిపోయి క్లాప్స్ కొట్టడం ఈ వీడియోలో చూడొచ్చు.

అయితే ఈ సందర్భంగా చెర్రీ చేసిన కామెంట్స్ నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి. గతంలో చికిరి చికిరి పాట అనౌన్స్మెంట్ సమయంలో బుచ్చిబాబు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ను గుర్తు చేసుకున్న రామ్ చరణ్(Ram Charan ).. బుచ్చిబాబుకు ఫన్నీగా కౌంటర్ ఇచ్చారు. చికిరి చికిరి పాట మోహిత్ చౌహాన్ పాడుతుంటే నువ్వు ఎలా యాక్టింగ్ చేశావంటే.. అది నువ్వే పాడావేమోనని అందరూ డౌట్ పడ్డారు. కానీ ఇక్కడ మాత్రం యాక్టింగ్ చేయకు, నా డబ్బింగ్ నేనే చెప్పుకుంటున్నానంటూ ఆటపట్టించారు. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ రౌండ్లు కొడుతుంది.
నిజానికి ఈ సినిమాను మార్చిలోనే విడుదల చేయాలని భావించినా సరే..షూటింగ్ ఆలస్యం కావడంతో ఆ డేట్‌ను చెర్రీ బాబాయ్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం వదిలేశారు. ఇప్పుడు సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30న.. పెద్ది మూవీ గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.
సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడుతుందనే ప్రచారానికి చెక్ పెడుతూ, 50 రోజుల ముందే పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడప్ చేశారు. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పీరియడ్ డ్రామాలో..శ్రీదేవి తనయ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు వంటి ఉద్ధండ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Mega Power Star @AlwaysRamCharan begins dubbing for #Peddi 🔥🔥🔥
Get ready for a massive treat this summer ❤🔥#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026. pic.twitter.com/EtblFN2wP0
— PEDDI (@PeddiMovieOffl) March 1, 2026



