RAPO23 : యాక్టింగ్‌తో పాటు డైరెక్షన్.. ఇంటర్నేషనల్ మెన్స్ డే వేళ రామ్ పోతినేని గ్రాండ్ సర్ప్రైజ్..
RAPO23 : ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా హీరో రామ్ పోతినేని తన డ్రీమ్ ప్రాజెక్ట్ #RaPo23 నుంచి ‘లోన్ వోల్ఫ్’ ప్రీ-లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రామ్ స్వయంగా డైరెక్షన్ వహిస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్ సినీ ఇండస్ట్రీలో ఇపుడు హాట్ టాపిక్ అయింది.
RAPO23
ఈరోజు అంటే నవంబర్ 19వ తేదీన ఇంటర్నేషనల్ మెన్స్ డేని పురస్కరించుకుని టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రపంచంలోని మగవారందరికీ సెల్యూట్ చేస్తూ స్పెషల్ విష్ చేశారు. ఈ గ్రాండ్ అకేషన్‌ను మరింత స్పెషల్‌గా మారుస్తూ తన కెరీర్లోనే మైల్‌స్టోన్‌లా నిలిచే #RAPO23 ప్రాజెక్ట్ నుంచి ఒక పవర్ఫుల్ ప్రీలుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా ఈరోజు రిలీజ్ చేశారు.
ఈ మూవీలో తాను పోషిస్తున్న లోన్ వోల్ఫ్ క్యారెక్టర్ బ్యాక్ లుక్‌ని ప్రజెంట్ చేస్తూ వదిలిన ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతోంది.
తన ఎక్స్ ఖాతాలో ఈ పోస్టర్‌ను షేర్ చేసిన రామ్.. లోన్ వోల్ఫ్ అంటే సొసైటీతో పని లేకుండా తనకంటూ ఒక స్పెషల్ దారిని ఎంచుకుని, ఈ ప్రపంచంతో ఒంటరిగా పోరాడే అత్యంత ఇండిపెండెంట్ భావాలు కలిగిన వ్యక్తి అని ఆ క్యారెక్టర్ డెఫినిషన్‌ని వివరించారు.
మైండ్ బ్లాకింగ్ ఎమోషన్స్, తిరుగులేని కాన్ఫిడెన్స్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ నియో నాయర్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ రామ్ కెరీర్లోనే ఒక నయా బెంచ్‌మార్క్ కాబోతోంది. ఎందుకంటే ఈ మూవీతో రామ్ కేవలం నటుడిగానే కాకుండా.. ఫస్ట్ టైమ్ రైటర్‌గా, డైరెక్టర్‌గా మెగాఫోన్ పట్టి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రామ్ పక్కన హీరోయిన్గాా సంయుక్తా మీనన్ నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ ఓ ఇంపార్టెంట్ పాత్రలో మెరవనున్నారు.
టెక్నికల్ పరంగా కూడా ఈ పిక్చర్‌ను నెక్స్ట్ లెవెల్లో తీర్చిదిద్దుతున్నారు. ఫేమస్ సినిమాటోగ్రాఫర్ ఎస్.తిరునావుక్కరసు కెమెరా బాధ్యతలను చూస్తుండగా, సౌత్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన సామ్ సీఎస్ మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు మ్యూజిక్ అందిస్తున్నారు. రాపో సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ పోతినేని హెవీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెలుగు ఆడియన్స్‌కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడానికి రెడీ అవుతోంది.





