Vishwambhara:మెగాభిమానులకు మెగా గిఫ్ట్.. దానికోసం ఉగాదికి డేట్ ఫిక్స్ చేసిన విశ్వంభర టీమ్
Vishwambhara:విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా వర్క్ చేస్తున్న చిత్ర యూనిట్.. ఈ ఉగాదికి మెగా ఫ్యాన్స్‌కు ఒక భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తోంది.
Vishwambhara
మన శివశంకర వరప్రసాద్ గారు సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన మెగాస్టార్ చిరంజీవి.. విశ్వంభరతో మరోసారి అదే పనికి సిద్ధమవుతున్నారు. బింబిసార చిత్రంతో తనదైన ముద్ర వేసిన డైరక్టర్ వశిష్ఠ..డైరక్షన్లో వస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా వర్క్ చేస్తున్న చిత్ర యూనిట్.. ఈ ఉగాదికి మెగా ఫ్యాన్స్‌కు ఒక భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తోంది.
విశ్వంభర (Vishwambhara)సినిమా కథ 14 లోకాల కాన్సెప్ట్‌తో సాగే ఒక అడ్వెంచరస్ జర్నీగా సాగుతోందని తెలుస్తోంది. అధోలోకాలు, ఊర్థ్వ లోకాల మధ్య జరిగే పోరాటంతో పాటు, విశ్వంభర అనే అద్భుత లోకానికి చేరుకోవడానికి మెగాస్టార్ చేసే సాహసయాత్ర ఆడియన్స్‌కు సరికొత్త అనుభూతిని పంచబోతోంది.
గతంలో రిలీజైన గ్లింప్స్‌పై వచ్చిన కొన్ని విమర్శలను కూడా దృష్టిలో పెట్టుకున్న మేకర్స్.. కేవలం విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కోసమే ఇప్పుడు దాదాపు 75 కోట్ల భారీ బడ్జెట్‌ను వెచ్చిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి సీజీ వర్క్‌తో ఆడియన్స్‌ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి డైరక్టర్ వశిష్ఠ పట్టుదలగా ఉన్నాడు.

ఇక మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశ్వంభర (Vishwambhara) మూవీ రిలీజ్ డేట్‌పై అప్డేట్ .. ఈ ఉగాదికి వచ్చే అవకాశం ఉంది. ఎలా అయినా 2026 వేసవి బరిలో విశ్వంభరను నిలపడానికి యూవీ క్రియేషన్స్ గట్టిగా ప్లాన్ చేస్తోంది. సమ్మర్ రేసులో ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ది వంటి సినిమాలు కూడా ఉండటంతో, ఈ ఏడాది వేసవి మొత్తం మెగా ఫ్యామిలీ సందడి కనిపించబోతోంది. ఉగాది సందర్భంగా రిలీజ్ చేయబోయే కొత్త గ్లింప్స్ ద్వారా విజువల్స్ క్వాలిటీ ఏ రేంజ్లో ఉండబోతుందో..చిన్నగా శాంపిల్ చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
రీసెంటుగా ఓ ఈవెంట్లో నిర్మాత ధీరజ్ మొగిలినేని చేసిన కామెంట్లు.. ఈ సినిమాపై హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి. ఇప్పటికే సిద్ధమైన థియేట్రికల్ ట్రైలర్ చూసి మేకర్స్ షాక్ అయ్యారని.., టీజర్లో చూసిన దానికంటే ట్రైలర్ లోని విజువల్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయని ధీరజ్ చెప్పడం దీనికి మరింత హైప్‌ను పెంచేస్తుంది. మొత్తంగా మెగాస్టార్ పాత గ్లామర్‌ను, సరికొత్త ఫాంటసీ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి వస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజువల్ సునామీ క్రియేట్ చేయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.



