HealthJust LifestyleLatest News

Hot Water : వేసవిలో వేడి నీరు తాగడం మంచిదేనా ?..డాక్టర్లు చెప్పిన విషయాలివే

Hot Water : చాలామంది వేసవిలో కేవలం స్టైల్ కోసమో లేదా ఒక అలవాటుగా వేడి నీటిని తాగుతుంటారు.

Hot Water

ఎండలు మండిపోతున్నాయి. మే నెల కావడంతో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అందరూ ఏసీలు, కూలర్ల ముందే గడుపుతున్నారు. అదే సమయంలో కూల్ వాటర్ తాగేందుకే ఇష్టపడతారు. చల్లని నీళ్లు తాగితే జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశముంటుంది.

అయితే కొందరు ఎంత వేడి వాతావరణం ఉన్నా గోరు వెచ్చని నీళ్లు తాగుతుంటారు. స్టైల్ కోసమో లేదా అలవాటు మానుకోలేక ఇలా వేడి మంచినీళ్లు తాగుతారు. మరి మండిపోతున్న వేసవిలో హాట్ వాటర్(Hot Water) తాగడం మంచిదేనా అన్న డౌట్ కూడా చాలామందికి వస్తుంటుంది. కానీ వేడి నీరు మితంగా తాగడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.

గోరువెచ్చని నీరు తాగితే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగడంతో పాటు మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే వేడి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత స్వల్పంగా పెరిగి చెమట పడుతుంది. ఈ చెమట ద్వారా శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. గోరువెచ్చని నీటితో రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. తద్వారా రక్త ప్రసరణ మెరుగవుతుంది.

ఒకవేళ చల్లని నీటితో లేదా ఐస్ క్రీమ్ ,కూల్ డ్రింక్స్ వంటి వాటితో గొంతులో ఇబ్బంది ఉంటే వేడినీటితోనే రిలీఫ్ దక్కుతుంది. చల్లటి నీటి కంటే గోరువెచ్చని నీరు తాగడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. మెటబాలిజం (జీవక్రియ) వేగవంతమవుతుంది. వేసవిలో ఫ్రిజ్ లో ఉండే చల్లటి నీరు తాగినప్పుడు శరీర ఉష్ణోగ్రతలో అనూహ్య మార్పులు వస్తాయి.

Hot Water
Hot Water

అదే సమయంలో గోరువెచ్చని నీరు తాగితే సమస్య ఉండదు, శరీరం త్వరగా హైడ్రేట్ అవుతుంది. వేసవిలో గోరువెచ్చని నీటిని మితంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇదిలా ఉంటే ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీరు తాగే అలవాటు ఉన్నవారికి, వేసవిలో అది కొనసాగించాలా వద్దా అన్నఅనుమానం వస్తుంది.

వేసవిలో ఎక్కువగా మరిగించిన నీటిని(Hot Water) తాగడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. గోరువెచ్చని నీటిని మాత్రం పరిమితంగా తీసుకోవచ్చని సూచిస్తున్నారు. అటు వేసవిలో మరీ ఎక్కువ వేడిగా ఉన్న నీటిని తాగడం కూడా మంచిది కాదు. బాగా వేడి నీరు తాగితే విపరీతంగా చెమట పట్టి డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వేడి నీటిని మితంగా తీసుకుంటే ఎటువంటి ఇబ్బందీ ఉండదనీ, శరీరానికి ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

Memories: జ్ఞాపకాల భారంలో వర్తమానం నలిగిపోతుందా? దీని నుంచి ఎలా బయటపడాలి?

Related Articles

Back to top button