HealthJust LifestyleLatest News

Red Wine : రెడ్ వైన్ తాగితే లాభాలేనట.. కానీ వారు మాత్రం అస్సలు తీసుకోకూడదట..

Red Wine: ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా రెడ్ వైన్ ఉపయోగపడుతుందని బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

Red Wine

మద్యపానం ఆరోగ్యానికి హానికరమనేది అందరికీ తెలిసిన సత్యం. అయితే రెడ్ వైన్ (Red Wine) విషయంలో కొన్ని ఆసక్తికరమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తక్కువ మోతాదులో రెడ్ వైన్ తీసుకోవడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుందని చాలామంది నిపుణులు చెబుతూ ఉంటారు.

రెడ్ వైన్‌(Red Wine)లో ఉండే పాలీఫీనాల్స్ సమూహానికి చెందిన టానిన్లు రక్తనాళాల్లో అడ్డంకులను తొలగించి రక్త ప్రసరణ సజావుగా సాగేలా చేస్తాయి. అలాగే దీనిలోని ఎల్లాజిక్ యాసిడ్ శరీరంలోని కొవ్వు కణాల డెవలప్మెంట్‌ను అడ్డుకుంటుంది. దీనివల్ల వెయిట్ తగ్గాలనుకునే వారికి , టైప్ 2 డయాబెటిస్ ముప్పు ఉన్నవారికి కొంతవరకు ప్రయోజనం చేకూరుతుంది.

కేవలం ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా రెడ్ వైన్ ఉపయోగపడుతుందని బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇది చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు ముఖ కండరాలకు రిలీఫ్‌ను ఇస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు రాత్రిపూట కొద్దిగా రెడ్ వైన్ తీసుకుని పడుకుంటే.. హాయిగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది.

అయితే ఇవన్నీ కూడా తక్కువ మోతాదులో లోబడి తీసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతాయి. అతిగా తాగడం వల్ల ఈ ప్రయోజనాలన్నీ పోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా కాలేయ సంబంధిత వ్యాధులు , క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది.

Red Wine
Red Wine

అంతేకాదు రెడ్ వైన్ అందరికీ సరిపడదు. వందలో పది శాతం మందికి దీనివల్ల అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆస్తమా బాధితులు రెడ్ వైన్‌కు దూరంగా ఉండటం మంచిది. గర్భిణీలు , పాలిచ్చే తల్లులు అస్సలు రెడ్ వైన్ తాగకూడదు. ఇది పిండం పెరుగుదలపై ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది.

అలాగే గౌట్ వంటి కీళ్ల నొప్పులు ఉన్నవారికి రెడ్ వైన్ మరింత ఇబ్బంది కలిగిస్తుందట. అంతేకాదు రెడ్ వైన్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా తీసుకుంటే వెయిట్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక అలవాటు చేసుకునే ముందు దాని లాభనష్టాలను బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం.

Destiny : డెస్టినీ అంటే ఏంటి..మన ప్రమేయం లేకుండానే మన జీవితాలను డిసైడ్ చేస్తుందా?

Related Articles

Back to top button