Raw Papaya : పచ్చి బొప్పాయితో ఇన్ని లాభాలా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి అట..
Raw Papaya: పచ్చి బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో , జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా తోడ్పడుతుందట.
Raw Papaya
సాధారణంగా మనం పండిన బొప్పాయిని తినడానికే ఎక్కువ ఇష్టపడతాం. కానీ పచ్చి బొప్పాయిలో అంతకంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని మనలో చాలా మందికి తెలీదు. నిజానికి ఆయుర్వేదంలో పచ్చి బొప్పాయిని ఒక ఔషధంగా లెక్క గడతారు. దీనిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో , జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా తోడ్పడుతుందట.
ఎవరైతే అజీర్ణం, గ్యాస్ , మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతుంటారో, వారికి పచ్చి బొప్పాయి ఒక గొప్ప పరిష్కారం అని ఆయుర్వేదం చెబుతుంది. ఇది కేవలం జీర్ణక్రియకే కాకుండా, బరువు తగ్గాలనుకునే వారికి కూడా మంచి ఆహారంగా చెబుతారు. ఎందుకంటే దీనిలో క్యాలరీలు తక్కువగా, పీచు పదార్థం (ఫైబర్) ఎక్కువగా ఉంటుంది.
అంతేకాకుండా చర్మ సౌందర్యానికి కూడా పచ్చి బొప్పాయి(Raw Papaya) చాలా మేలు చేస్తుంది. బొప్పాయి రక్తాన్ని శుద్ధి చేసి చర్మంపై ముడతలు, మొటిమలు రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా బాడీని డిటాక్స్ చేయడంలో అంటే లోపలి వ్యర్థాలను బయటకు పంపడంలో పచ్చి బొప్పాయి కీలకంగా పనిచేస్తుంది.

అయితే, దీనిని తీసుకునేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి బొప్పాయిని డైరెక్టుగా పండులా తినడం కంటే కూరగా వండుకోవడం కానీ సూప్‌లు, సలాడ్ల రూపంలో తీసుకోవడం కానీ చేస్తే మంచిది. ఎందుకంటే బొప్పాయిని ఉడికించినప్పుడు అందులోని పోషకాలు శరీరానికి బాగా అందుతాయి.
కానీ మహిళల ఆరోగ్యం విషయంలో మాత్రం పచ్చి బొప్పాయి ప్రభావం కొంత భిన్నంగా ఉంటుందట. హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారికి ఇది మేలు చేసినా సరే, గర్భిణీలు మాత్రం పచ్చి బొప్పాయికి దూరంగా ఉండటం చాలా అవసరం అని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే పచ్చి బొప్పాయి(Raw Papaya)లో ఉండే లాటెక్స్ గర్భాశయ సంకోచాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భం దాల్చాలనుకునే వారు ,గర్భిణీలు తప్పనిసరిగా పచ్చి బొప్పాయి తినే విషయంలో డాక్టర్ సలహా తీసుకోవాలి.
Punjab Kings : ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్..పంజాబ్ కింగ్స్‌కు ఎదురుందా ?





