HealthLatest News

Bitter Gourd Seeds : కాకరకాయ గింజలు తినొచ్చా? అసలు వాటినితింటే ఏం జరుగుతుందో తెలుసా?

Bitter Gourd Seeds : లేత కాకరకాయ గింజల్లో ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్లు , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

Bitter Gourd Seeds

కాకరకాయ హెల్త్‌కు చాలా మంచి చేసే కూరగాయ అని పెద్దలు చెబుతూ ఉండేవారు. కాకరకాయ ఓకే కానీ చాలామందికి కాకరకాయలోని గింజలను(Bitter Gourd Seeds) తినొచ్చా లేదా అనే డౌట్ వస్తుంటుంది. నిజానికి దీనికి సమాధానం ఆ కాకరకాయ గింజల లేతతనంపైన ఆధారపడి ఉంటుంది.

లేత కాకరకాయలో ఉండే తెల్లటి, మెత్తటి గింజలను అయితే నిరభ్యంతరంగా తినొచ్చు. అయితే బాగా పండిపోయి, ఎర్రటి పొరతో గట్టిగా మారిన కాకర గింజలను మాత్రం తీసుకోకపోవడమే మంచిది.

లేత కాకరకాయ గింజల్లో(Bitter Gourd Seeds) ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్లు , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని మన బాడీలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

ఈ గింజల్లోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను చురుగ్గా ఉంచడమే కాకుండా మలబద్ధకం సమస్యను తగ్గించడంలోనూ తోడ్పడుతుంది. అలాగే దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీర కణాలను పాడవకుండా రక్షించడంలో సాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికితోడు వీటి ద్వారా లభించే ప్రోటీన్, కొవ్వు ఆమ్లాలు బాడీకి అవసరమైన పోషక విలువలను అందిస్తాయి.

అయితే గట్టిగా, ముదిరిపోయిన గింజలను అస్సలు తినకుండా ఉండటమే మంచిది. ఒకవేళ తిన్నా మితంగా తినాలి. ఎందుకంటే కొందరిలో ఇవి కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా జీ6పీడీ (G6PD) లోపం ఉన్నవారు కాకరకాయ గింజలను తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Bitter Gourd Seeds
Bitter Gourd Seeds

వీటిని తింటే అరుదుగా వీటివల్ల రక్తకణాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉంది. అలాగే గర్భవతులు లేదా సంతానం కోసం ప్రయత్నించే మహిళలు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

వంటలు వండేటప్పుడు లేత కాకరకాయల్లోని లేత గింజలను అలాగే ఉంచేసి కూర చేసుకోవచ్చు. ఒకవేళ గింజలు గట్టిగా ఉంటే మాత్రం వాటిని తీసేసి వండుకోవడమే రుచికి, ఆరోగ్యానికి మంచిదని గుర్తు పెట్టుకోవాలి.

Placebo Effect : ప్రశంసలు, ప్రేమపూర్వక మాటలు అంత ఎఫెక్ట్ చూపిస్తాయా? బ్రెయిన్ కెమిస్ట్రీని మార్చే మ్యాజిక్ తెలుసుకోండి..

Related Articles

Back to top button