HealthLatest News

Grapes :నల్ల ద్రాక్ష వర్సెస్ పచ్చ ద్రాక్ష.. ఏది తింటే ఆరోగ్యానికి మంచిది?

Grapes : రాత్రి పడుకోవడానికి ముందు ద్రాక్ష తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం కానీ గుండెల్లో మంట వచ్చే అవకాశం కానీ ఉంటుంది.

Grapes

వేసవి కాలంలో మార్కెట్‌లో మామిడి పండ్లతో పాటు మనకు ఎక్కువగా కనిపించేవి ద్రాక్ష పండ్లే. అయితే మనకు పచ్చటి ద్రాక్షతో పాటు నల్ల ద్రాక్ష కూడా విరివిగా కనిపిస్తుంటాయి. అయితే ఈ రెండింటిలో ఏది మంచిది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

పోషక విలువల పరంగా చూస్తే, రెండు రకాలూ ఆరోగ్యకరమైనవే అయినా కూడా నల్ల ద్రాక్ష(Grapes )లో యాంటీ ఆక్సిడెంట్ల శాతం కొంత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నల్ల ద్రాక్ష(Grapes )లో ఉండే రెస్వెరాట్రాల్ అనే మూలకం వృద్ధాప్య ఛాయలను అడ్డుకోవడంలో , గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకంగా పనిచేస్తుంది. కంటి చూపు మెరుగుపడటానికి అవసరమైన ల్యూటిన్, జీయాక్సాంథిన్ వంటి పోషకాలు కూడా నల్ల ద్రాక్షలో సమృద్ధిగా ఉంటాయి.

మరోవైపు పచ్చ ద్రాక్షలో విటమిన్-సి , విటమిన్-కె పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి ఇన్‌స్టెంట్ ఎనర్జీని ఇవ్వడంతో పాటు రక్తపోటును కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి పచ్చ ద్రాక్ష మంచివి అని నిపుణులు చెబుతున్నారు.

Grapes
Grapes

అయితే ద్రాక్ష పండ్లను తినేటప్పుడు సమయం చాలా ముఖ్యం. రాత్రి పడుకోవడానికి ముందు ద్రాక్ష తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం కానీ గుండెల్లో మంట వచ్చే అవకాశం కానీ ఉంటుంది. అంతేకాదు ఉదయం పూట ఖాళీ కడుపుతో పుల్లటి ద్రాక్షలు తింటే ఎసిడిటీ వచ్చే ప్రమాదం ఉంది.

ద్రాక్ష పండ్ల విషయంలో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పురుగుమందుల వాడకం. ద్రాక్ష గుత్తుపై కెమికల్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో, వాటిని కొన్నాక కనీసం అర గంట పాటు అయినా ఉప్పు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత శుభ్రంగా కడిగి మాత్రమే వీటిని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్రిమిసంహారక మందుల ప్రభావం తగ్గడంతో ఎలాంటి సైడ్ ఎఫెక్టులు రావు.

Ram Charan: రామ్ చరణ్ పెద్ది రిలీజ్ డేట్ లాక్.. బాక్సాఫీస్ వద్ద మెగా వేట మొదలయ్యేది అప్పుడేనా?

Related Articles

Back to top button