Coconut Water : వర్షాకాలంలో కొబ్బరి నీళ్లు తాగొచ్చా? తాగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Coconut Water : వేసవి కాలంలో అమృతంలా పనిచేస్తాయని అందరూ ఇష్టపడి తాగే కొబ్బరి నీళ్లు.. చలి, వర్షా కాలంలో తాగొచ్చా లేదా అనే ప్రశ్న చాలా మందిలో వస్తుంది.
Coconut Water
రెయినీ సీజన్ రాగానే ప్రకృతి ఎంత అందంగా మారుతుందో, వాతావరణంలో తేమ వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు , వైరస్‌లు వచ్చే ముప్పు కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఇలాంటి టైమ్‌లో శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలనే అనుమానాలు అందరినీ వేధిస్తుంటాయి.
దీనిలో ముఖ్యంగా వేసవి కాలంలో అమృతంలా పనిచేస్తాయని అందరూ ఇష్టపడి తాగే కొబ్బరి నీళ్లు(Coconut Water).. చలి, వర్షా కాలంలో తాగొచ్చా లేదా అనే ప్రశ్న చాలా మందిలో వస్తుంది. అయితే వానలు పడేటప్పుడు కూడా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల బాడీకి చాలా ప్రయోజనాలు కలుగుతాయని డాక్టర్లు చెబుతున్నారు.
కొబ్బరి నీళ్లలో(Coconut Water) నేచురల్‌గా ఉండే ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉండి, వానాకాలంలో నీళ్లు సరిగా తాగకపోవడం వల్ల తలెత్తే డీహైడ్రేషన్ సమస్యను అడ్డుకుని శరీరానికి తక్షణ ఉత్సాహాన్ని ఇస్తాయి. కానీ ఈ కాలంలో వెదర్‌లో హ్యుమిడిటీ లేదా తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల కొబ్బరి బోండాలు చాలా త్వరగా బ్యాక్టీరియా బారిన పడి తొందరగా పాడైపోయే ప్రమాదం ఉంటుంది.

అందుకే మనం కొబ్బరి నీళ్లు తాగేముందు కొబ్బరి బోండాన్ని చెక్ చేసుకుని తాజాగా ఉండేది ఎంచుకుని ఆ నీళ్లను తాగాలి. అలాగే మన కళ్ల ముందే కొట్టినవి మాత్రమే తీసుకోవాలి. చాలా సేపటి క్రితం తీసి నిల్వ ఉంచినవి, స్వల్పంగా రంగు, రుచి , వాసన మారిన కొబ్బరి నీళ్లను పొరపాటున కూడా ముట్టుకోకూడదు. ఎందుకంటే వాటిలో ఆల్రెడీ ఫంగస్ చేరి ఉంటుంది కాబట్టి విరేచనాలు లేదా జీర్ణకోశ వ్యాధులకు దారితీయొచ్చు.
అంతేకాకుండా రోడ్డు పక్కన కొబ్బరి బోండాలు తాగాలనుకున్నప్పుడు ఆ పరిసరాలు ఎంతవరకు పరిశుభ్రంగా ఉన్నాయో గమనించాలి. ముఖ్యంగా గర్భిణీలు, చిన్న పిల్లలు , రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వర్షాకాలంలో కొబ్బరి నీళ్లను తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
TRS : ఈసీ చేతిలో టీఆర్ఎస్ సెంటిమెంట్.. కవిత పార్టీ పేరు మార్పు ఎలాంటి టర్నింగ్‌లు తీసుకోబోతోంది?





