Dal
మన రోజువారీ భోజనంలో పప్పు అనేది ఒక ముఖ్యమైన వంట. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే పప్పును సుమారు ప్రతి ఇంట్లోనూ రోజూ వండుతుంటారు. అయితే, వండేటప్పుడు చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల పప్పు టేస్ట్ మారడమే కాకుండా, దీనిలో ఉండే పోషక విలువలు, మెత్తదనం కూడా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది.
సరైన పద్ధతిని ఫాలో అయితే పప్పు(Dal) మరింత టేస్టీగా, హెల్దీగా మారుతుంది. పప్పు వండేటప్పుడు చేసే మిస్టేక్స్, వాటిని సరిదిద్దుకోవడానికి పాటించాల్సిన సింపుల్ టిప్స్ తెలుసుకుంటే చాలు.
చాలా మంది పప్పును(Dal) అస్సలు నానబెట్టకుండా డైరెక్ట్‌గా వండేస్తుంటారు. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు వంటి వాటిని వండటానికి ముందు కనీసం గంట నుంచి 2 గంటల వరకు నానబెట్టడం చాలా మంచిది.
ఇలా చేయడం వల్ల పప్పు చాలా త్వరగా ఉడికిపోవడమే కాకుండా, దానిని తిన్నప్పుడు గ్యాస్ వంటి ప్రాబ్లెమ్స్ రాకుండా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే పప్పును వండేటప్పుడు వాటర్ క్వాంటిటీ కూడా చాలా చాలా ముఖ్యం. నీళ్లు మరీ ఎక్కువ అయితే పప్పు చారులా పల్చగా అయిపోతుంది. అదే చాలా తక్కువ వేస్తే అడుగంటి సరిగా ఉడకదు పైగా మాడిపోతుంది. అందుకే పప్పు రకాన్ని బట్టి వాటర్ మోతాదును కరెక్ట్‌గా చూసుకోవాలి.
ఇక రుచి విషయంలో చాలా మంది పప్పు ఉడికించేటప్పుడు ముందే ఉప్పు వేసేస్తుంటారు. మొదట్లోనే ఇలా ఉప్పు వేయడం వల్ల కొన్ని రకాల పప్పులు అస్సలు మెత్తగా అవకుండా గట్టిగా ఉండిపోతాయి.
అందుకే పప్పు పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే చివర్లో ఉప్పు వేస్తే మంచి టెక్స్చర్ వస్తుంది. అలాగే పప్పును మరీ ఎక్కువ సేపు ఉడికించి పేస్ట్‌లా మార్చకూడదు, అలాగని తక్కువ ఉడికించి పలుకుగా కూడా ఉంచకూడదు. కరెక్ట్ టైమ్ చూసుకుని దించాలి.
క్వాలిటీ ఉన్న పప్పును ఎంచుకోకపోవడం కూడా రుచి తగ్గడానికి ఒక కారణం. షాపుల్లో దొరికే పాత పప్పులు ఉడకడానికి ఎక్కువ టైమ్ తీసుకుంటాయి. అందుకే సాధ్యమైనంత వరకు తాజా పప్పులు వాడితేనే టేస్ట్, సాఫ్ట్‌నెస్ రెండూ బాగుంటాయి.
వీటన్నింటితో పాటు పప్పులో అసలైన కిక్ ఇచ్చేది చివర్లో వేసే తాలింపునే. వేడి వేడి నూనె లేదా నెయ్యిలో జీలకర్ర, ఆవాలు, కొద్దిగా వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పప్పులో కలిపితే వచ్చే సువాసన, టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటాయి.
పప్పు తిరగమోత పోసిన వెంటనే వడ్డించకుండా, తాలింపు పెట్టిన తర్వాత కొద్ది నిమిషాల పాటు మూత పెట్టి అలాగే ఉంచితే ఆ ఫ్లేవర్స్ అన్నీ పప్పుతో కలిసి టేస్ట్ బాగుంటుంది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ ఇంట్లో పప్పు మరింత టేస్టీగా మారుతుంది.
Date Of Birth : జూలై 12న ఏ నెంబర్ వాళ్లకు ఎలాంటి లక్ ఉంది?ఎవరికి ఫుల్ ఎంజాయ్‌మెంట్, ఎవరికి అలసట?
