HealthLatest News

Custard Apple : గుండె జబ్బుల ముప్పును తగ్గించే పండు.. రోగనిరోధక శక్తి పెరగడానికి బెస్ట్ ఫ్రూట్ ఇదే..

Custard Apple : సీతాఫలం తింటే అది తక్షణ శక్తిని ఇస్తుంది. రోజంతా పని చేసి అలసిపోయిన వారికి కస్టర్డ్ యాపిల్ ఒక మంచి బూస్టర్‌లా పనిచేస్తుంది.

Custard Apple

ప్రకృతి మనకు అందించే సీజనల్ ఫ్రూట్స్‌లో సీతాఫలానికి (Custard Apple) ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంది. ఇది కేవలం తియ్యటి రుచిని మాత్రమే కాకుండా, మన బాడీకి కావలసిన ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్, ఫైబర్ , యాంటీఆక్సిడెంట్లను పుష్కలంగా అందిస్తుంది. అలసటను దూరం చేసి యాక్టివ్‌గా ఉంచడంలో, తిన్న ఆహారం బాగా డైజెస్ట్ చేయడంలో, గుండెను పదిలంగా కాపాడటంలో సీతాఫలం బాగా పనిచేస్తుంది.

సీతాఫలం తింటే అది తక్షణ శక్తిని ఇస్తుంది. రోజంతా పని చేసి అలసిపోయిన వారికి కస్టర్డ్ యాపిల్ ఒక మంచి బూస్టర్‌లా పనిచేస్తుంది. దీనిలో ఉండే సహజసిద్ధమైన చక్కెరలు, కార్బోహైడ్రేట్లు శరీరానికి త్వరగా అబ్జార్బ్ అయి, నీరసాన్ని క్షణాల్లో దూరం చేస్తాయి. శరీరానికి వెంటనే ఎనర్జీ రావడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది.

కడుపు సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరు బాగుండటానికి ఫైబర్ చాలా అవసరం. సీతాఫలంలో డైటరీ పీచుపదార్ధం ఎక్కువగా ఉండటం వల్ల మోషన్ ఫ్రీగా అవ్వడానికి సాయపడుతుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ఈ ఫ్రూట్‌ను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగై పొట్ట ప్రశాంతంగా ఉంటుంది.

హార్ట్ హెల్త్‌కు ఎంతో మేలు. గుండె జబ్బుల బారిన పడకుండా సీతాఫలంలోని పోషకాలు తోడ్పడతాయి. దీనిలో లభించే పొటాషియం, మెగ్నీషియం బాడీలో బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్‌లో ఉంచుతాయి. దీనివల్ల గుండె పనితీరు మెరుగుపడి ఆరోగ్యంగా ఉంటుంది.

సీతాఫలాన్ని(Custard Apple) తింటే ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తినిస్తుంది.మారుతున్న వాతావరణం వల్ల వచ్చే జబ్బుల నుంచి శరీరాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇందులో విటమిన్-సి , శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లు , వైరస్‌ల బారిన పడకుండా కాపాడతాయి.

Custard Apple
Custard Apple

చర్మం మెరవడంతో పాటు కంటి చూపు పెరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యలను తగ్గించడంలో , చూపును మెరుగుపరచడంలో సీతాఫలంలోని విటమిన్లు సాయపడతాయి. అలాగే, ఇవి చర్మానికి మంచి పోషణను అందించి ముడతలు పడకుండా కాపాడుతాయి. దీంతో స్కిన్ ఎప్పుడూ కాంతివంతంగా, యవ్వనంగా కనిపిస్తుంది.

సీతాఫలం ఆరోగ్యానికి ఎంతో మంచిదే అయినా, దీనిలో షుగర్ కంటెంట్ కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్, రక్తంలో చక్కెర నిల్వలు ఎక్కువగా ఉన్నవారు నిపుణుల సలహాతో మాత్రమే తీసుకోవడం మంచిది.

Katuruva : మటన్ ధరను దాటేసిన అడవి కూరగాయ.. కిలో రూ. వెయ్యి దాటినా ఎందుకంత క్రేజ్?

Related Articles

Back to top button