Just LifestyleLatest News

Healthy Relationship : చిన్న విషయానికే కొట్టుకునే స్థాయికి వెళ్తున్నారా?రిలేషన్‌షిప్‌ను కాపాడుకునే సింపుల్ సైకాలజీ టిప్స్

Healthy Relationship : ఒక రిలేషన్‌లో తరచూ గొడవలు రావడం, అపార్థాలు పెరగడం వల్ల మెంటల్‌ ప్రెజర్ పెరుగుతోందా? మీ బంధం హెల్దీగా ఉందో లేదో తెలుసుకోవడానికి,ప్రాబ్లెమ్స్ సాల్వ్ చేసుకోవడానికి సైకాలజీ నిపుణులు ఏం చెబుతున్నారో చూడండి..

Healthy Relationship

ఏ రిలేషన్‌లోనైనా చిన్న చిన్న గొడవలు, అలకలు రావడం కామన్. ప్రేమ ఉన్న చోటే గొడవలు ఉంటాయంటారు. అయితే ఆ గొడవల వల్ల డైలీ మనశ్శాంతి కరువైపోతుంటే మాత్రం దాని గురించి ఆలోచించాల్సిందే. చిన్న విషయాలకే కొట్టుకునే వరకు వెళ్లేంత పెద్ద రచ్చ జరగడం, క్షణికావేశంలో ఒకరినొకరు నిందించుకోవడం, మనసులో ఎప్పుడూ ఎమోషనల్ ప్రెజర్ ఉండటం వంటివి మీ రిలేషన్ డేంజర్‌లో పడిందనడానికి సంకేతాలు కావొచ్చు. అసలు తమ మధ్య ఎక్కడ పొరపాటు జరుగుతోంది? దాని నుంచి ఎలా బయటపడాలో సైకాలజిస్టులు చెప్పిన కొన్ని సూచనలు పాటిస్తే సరిపోతుంది.

చాలామంది ప్రాబ్లెమ్ వచ్చినప్పుడు దాని సొల్యూషన్ వెతకడం మానేసి, తప్పంతా నీదేనంటూ ఒకరిపై ఒకరు బ్లేమ్ గేమ్ మొదలుపెట్టడం చాలా పెద్ద రాంగ్ . పార్ట్‌నర్ చెప్పే మాటలను వినడానికి ఓపిక లేకపోవడం, ఎప్పుడో జరిగిన పాత గొడవలని మళ్లీ తోడటం వల్ల ప్రాబ్లెమ్ సాల్వ్ అవకపోగా మరింత ముదురుతాయి. ఇక ఆ బంధంలో నమ్మకం సడలిన చోట అసూయ, అతిగా డామినేషన్ చలాయించే నైజం బయటపడతాయి.

ఇంకొందరు గొడవ జరగ్గానే సైలెంట్ అయిపోవడం (Silent Treatment) లేదా నేను నిన్ను విడిచి వెళ్లిపోతానంటూ పదేపదే బ్రేకప్/డివోర్స్ బెదిరింపులకు దిగడం చేస్తుంటారు. దీనివల్ల అవతలి వ్యక్తిలో ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ పెరిగిపోయి, బంధంపై గౌరవం పోతుంది. అలాగే ఎదుటివారి ఫీలింగ్స్‌ను తక్కువ చేసి మాట్లాడటం, ఈగోలకు పోయి సారీ చెప్పకపోవడం, నేనే ఎందుకు తగ్గాలి అన్నట్లుగా ప్రవర్తించడం ఈ పరిస్థితిని మరింత దారుణంగా తయారుచేస్తాయి.

అయితే, ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇలాంటి గొడవలు జరిగినంత మాత్రాన మీ రిలేషన్(Healthy Relationship) ఫెయిల్ అయిందని అర్థం కాదు. అసలు ఇలాంటి గొడవలు ఎంత తరచుగా జరుగుతున్నాయి.. గొడవ జరిగాక ఇద్దరూ కలిసి దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటున్నారనేదే అసలైన పాయింట్ అని అంటున్నారు.

ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే.. మొదట ఈగోలు పక్కన పెట్టి ఒకరి మాట ఒకరు కూల్‌గా వినడం అలవాటు చేసుకోవాలి. ప్రైవసీ, గౌరవం విషయంలో హెల్దీ బౌండరీస్ (Healthy Boundaries) విధించుకోవాలి. ప్రాబ్లెమ్ మరీ ఎక్కువై సాల్వ్ చేసుకోవడం మీ వల్ల కానప్పుడు ఫ్యామిలీ కౌన్సెలర్ లేదా థెరపిస్ట్ దగ్గరకు కూడా వెళ్లొచ్చు. కానీ, ఎప్పుడైనా మీ రిలేషన్‌లో ఫిజికల్ వయొలెన్స్, అబ్యూజ్, బెదిరింపులు చోటుచేసుకుంటే మాత్రం రెండో ఆలోచన లేకుండా మీ సేఫ్టీకి,సెల్ఫ్ రెస్పెక్ట్‌కే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.

Maturity : నిజమైన మెచ్యూరిటీ అంటే ఏంటి? ఎమోషనల్ మెచ్యూరిటీ ఉన్నవారి ప్రవర్తన ఎలా ఉంటుంది?

Related Articles

Back to top button