HealthLatest News

Dragon Fruit : డ్రాగన్ ఫ్రూట్ తింటున్నారా?..ఈ 5 రకాల ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్త..

Dragon Fruit : డ్రాగన్ ఫ్రూట్‌లో పొటాషియం శాతం కాస్త ఎక్కువగానే ఉండటం వల్ల కిడ్నీ రోగులపై ఇది అదనపు భారాన్ని పెంచుతుంది.

Dragon Fruit

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్, విటమిన్ సి, అలాగే యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. దీనివల్ల మన బాడీకి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పండును అస్సలు తినకూడదట. ఒకవేళ తిన్నా చాలా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొంతమందికి కొన్ని రకాల పండ్లు తిన్నప్పుడు బాడీ అస్సలు సహకరించదు.అలా డ్రాగన్ ఫ్రూట్(Dragon Fruit) తిన్న తర్వాత బాడీలో దురద రావడం, చర్మంపై దద్దుర్లు రావడం, పెదవులు లేదా ఫేస్ మీద వాపు రావడం, అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డ్రాగన్ ఫ్రూట్‌కు దూరంగా ఉండాలి.

అలాగే డ్రాగన్ ఫ్రూట్‌(Dragon Fruit)లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం ఉన్నవారికి మంచిదే అయినా సరే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య, లేదా తరచూ విరేచనాల సమస్యతో బాధపడేవారు దీనిని ఎక్కువగా తీసుకుంటే జీర్ణవ్యవస్థ మరింత పాడైపోతుంది. అందువల్ల కడుపులో ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నా ఈ పండుకు దూరంగా ఉండటమే మంచిది.

Dragon Fruit
Dragon Fruit

బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడానికి మెడిసిన్ వాడుతున్న డయాబెటిస్ బాధితులు ఈ పండును తినే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. ఎందుకంటే ఇది షుగర్ లెవెల్స్‌పై ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుంది.అలాగే లోబీపీ సమస్య ఉండి, రక్తపోటును తగ్గించే మందులు వాడుతున్నవారు కూడా దీనిని తినేటప్పుడు డాక్టర్ల సలహా తీసుకోవాలి.

అంతేకాదు మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారెవరైనా తమ ఫుడ్‌లో పొటాషియం పరిమాణాన్ని చాలా తగ్గించుకోవాల్సి ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో పొటాషియం శాతం కాస్త ఎక్కువగానే ఉండటం వల్ల కిడ్నీ రోగులపై ఇది అదనపు భారాన్ని పెంచుతుంది. అందువల్ల డాక్టర్లను అడగకుండా ఈ పండును ముట్టుకోకపోవడమే మంచిది.

Satellite Phone : బీఎస్‌ఎన్‌ఎల్ శాటిలైట్ ఫోన్ ..అడవులు, కొండల్లోనూ పనిచేసే సూపర్ డివైస్ స్పెషాలిటీలు ఇవే..

Related Articles

Back to top button