Kiwi
ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న మెయిన్ ప్రాబ్లమ్ హెయిర్ ఫాల్. రకరకాల షాంపూలు, ఆయిల్స్ మార్చినా కూడా ఎటువంటి రిజల్ట్ ఉండట్లేదని ఫీల్ అయ్యే వాళ్లకు మార్కెట్‌లో దొరికే కివీ పండు అద్భుతంగా హెల్ప్ అవుతుంది.
చూడటానికి పెద్ద సపోటాలా కనిపిస్తూ…. తినడానికి కొద్దిగా పుల్లగా, తీపిగా ఉంటుంది. ఈ కివీ ఫ్రూట్ కేవలం హెల్త్‌కే కాదు, జుట్టును కుదుళ్ల నుంచి స్ట్రాంగ్‌గా మార్చడానికి కూడా ఒక వండర్ లాగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు.
ముఖ్యంగా అమ్మాయిలు ఉదయం పూట ఈ కివీ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా, హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందట. తరచూ జుట్టు సమస్యలతో ఇబ్బంది పడేవాళ్లు కూడా ఈ జ్యూస్‌ను ఉదయం తాగితే జుట్టు ఊడిపోవడం తగ్గి, ఒత్తుగా పెరగడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది.
ఇంకా చెప్పాలంటే అమ్మాయిలకు ఇదొక బెస్ట్ నేచురల్ మెడిసిన్ అని చెప్పుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇప్పటి వరకు మీ డైట్‌లో కివీని చేర్చుకోకపోతే వెంటనే అలవాటు చేసుకోండి.
అలాగే ఈ కివీ(Kiwi) పండులో బాడీకి కావాల్సిన విటమిన్- సి పీక్ లెవెల్స్‌లో ఉంటుంది. ఎప్పుడూ వీక్‌గా ఉండటం, అలసట, తరచూ బీపీ డౌన్ వంటి సమస్యలతో బాధపడే వాళ్లు కివీ పండును తింటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది బాడీలో ఇమ్యూనిటీ పవర్ అంటే రోగనిరోధక శక్తిని పెంచి ఎలాంటి ఇన్ఫెక్షన్లు దగ్గరకు చేరకుండా ప్రొటెక్ట్ చేస్తుంది.
ఏ ఫ్రూట్ మార్కెట్‌లో అయినా కూడా కివీ(Kiwi) పండు చాలా ఈజీగా దొరుకుతుంది. దీంతో పాటు అందర్నీ ఇబ్బంది పెట్టే సమస్యల్లో జీర్ణ సమస్య కూడా ఒకటి. ఈ ఇన్‌డైజెషన్ సమస్యతో ఇబ్బంది పడేవాళ్లు తరచూ కివీ జ్యూస్ తీసుకుంటే జీర్ణ క్రియ పనితీరు మెరుగుపడుతుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇది పొట్ట సమస్యలకు ఈజీగా చెక్ పెడుతుంది.
అయితే ఈ అంశాలు కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే.ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం ప్రకారం మాత్రం ఇక్కడ తెలియజేయడమైనది. హెల్త్ రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా, కొత్త డైట్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే వాళ్లు వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
Mccullum : బజ్‌బాల్ శకానికి ముగింపు..టెస్ట్ కోచ్‌గా తప్పుకున్న మెక్‌కల్లమ్
