HealthLatest News

Healthy : మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ప్రకృతి సిద్ధమైన ఆహారంతో హెల్దీగా ఉండండి.

Healthy : ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు ఊరకనే అనలేదు. అందుకే మనం తీసుకునే రోజువారీ ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా స్పెషలిస్ట్‌లు, డాక్టర్లు అవసరం లేకుండానే హాయిగా జీవించొచ్చు

Healthy

ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు ఊరకనే అనలేదు. అందుకే మనం తీసుకునే రోజువారీ ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా స్పెషలిస్ట్‌లు, డాక్టర్లు అవసరం లేకుండానే హాయిగా జీవించొచ్చు. ప్రకృతి అందించిన పండ్లు, గింజలలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని, వాటితోనే ఎన్నో వ్యాధులకు సింపుల్‌గా చెక్ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు.

ఉదాహరణకు రోజూ చిన్న కొబ్బరి ముక్కను మన డైలీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది నరాల క్షీణత సంబంధిత వ్యాధుల నుంచి మనల్ని రక్షించడంతో పాటు న్యూరాలజిస్ట్ అవసరం లేకుండా చేస్తుంది.

అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల చాలామందిలో కలిగే అనవసర ఆందోళన, నిరాశ తగ్గి మానసిక ప్రశాంతత దొరుకుతుంది. దీని వల్ల సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. అంతేకాదు విటమిన్-సి నిధి అయిన ఉసిరికాయను ప్రతీ రోజు తప్పనిసరిగా తీసుకుంటే.. రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు దరిచేరవు.

అలాగే డైలీ మన జీర్ణక్రియ ఈజీగా సాగాలంటే రోజుకు ఒక అరటిపండు తీసుకోవడం చాలా మంచిది. ఇది ఎసిడిటీని తగ్గించి ప్రేగుల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. హార్మోన్ల సమతుల్యత కోసం అంజీర్ పండును తీసుకోవాలి. అలాగే రక్తహీనత , అలసటను నివారించి ఐరన్ పెంచడానికి ఖర్జూరాన్ని రెగ్యులర్‌గా తప్పనిసరిగా తీసుకోవాలి.

Healthy
Healthy

గుండె ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవారు రోజుకు ఒక దానిమ్మ పండును తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే కిడ్నీల పనితీరు మెరుగుపడటానికి పిస్తా పప్పులు, చర్మం ప్రకాశవంతంగా అలాగే పొడిబారకుండా ఉండటానికి విటమిన్-ఇ ఎక్కువగా ఉండే బాదం పప్పులను డైలీ తీసుకోవడం అలవాటుగా మార్చుకోవాలి. ఇక కాలేయ శుద్ధికి బొప్పాయి పండు ఎంతగానో సహాయపడుతుంది.

ఇలా అందరి వంటగదిలో ఉండే, మనందరి కళ్ల ముందే ఉంటున్న సహజ సిద్ధమైన ఆహార పదార్థాలను సరైన పద్ధతిలో తీసుకుంటే, ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరముండదు. అందుకే ఎప్పుడైనా సరే నివారణ అనేది చికిత్స కంటే మిన్న అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Fatty Liver: ఫ్యాటీ లివర్‌లో ఎన్ని స్టేజ్‌లు ఉంటాయి ? దశలో లక్షణాలుంటాయి?

Related Articles

Back to top button