Hemoglobin
మన బాడీలో ప్రతి సెల్‌కు ఆక్సిజన్‌ను అందించే ఇంపార్టెంట్ అయిన ప్రోటీన్ హిమోగ్లోబిన్ అన్న విషయం తెలిసిందే. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గితే అనీమియా వచ్చి నీరసపడతారని కూడా మనందరికీ తెలుసు. అయితే అదే హిమోగ్లోబిన్ ఉండాల్సిన దాని కంటే లిమిట్ దాటి విపరీతంగా పెరిగితే ఏం జరుగుతుందనేది చాలామందికి తెలీదు.
హిమోగ్లోబిన్(Hemoglobin) ఉండాల్సిన దానికంటే లిమిట్ దాటితే మాత్రం.. డైరెక్టుగా ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ అసాధారణంగా పెరిగినప్పుడు బ్లడ్ బాగా చిక్కబడిపోతుంది. దీనివల్ల నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయి, గుండెలో లేదంటే బ్రెయిన్‌లో బ్లడ్ గడ్డకట్టి ఒక్కసారిగా హార్ట్ అటాక్ లేదా పక్షవాతం వచ్చే డేంజర్ ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా మగవారిలో 13 నుంచి 16.5 g/dL, మహిళల్లో అయితే 12 నుంచి 15 g/dL వరకు హిమోగ్లోబిన్ ఉండాలి. బాడీ డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు టెంపరరీగా ఇది ఎక్కువగా కనిపించొచ్చు. అయితే స్మోకింగ్ ఎక్కువగా చేయడం, ఎత్తైన పర్వత ప్రాంతాల్లో నివసించడం, స్లీప్ అప్నియా అంటే నిద్రలో శ్వాస ఆగడం, ఊపిరితిత్తుల జబ్బులు లేదంటే బోన్ మ్యారో సమస్యల వల్ల ఇది కంటిన్యూగా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. తమ సలహా లేకుండా ఇష్టానుసారంగా ఐరన్, విటమిన్ బి-12 సప్లిమెంట్లు వాడటం కూడా ప్రమాదకరమేనని డాక్టర్లు అంటున్నారు.
హిమోగ్లోబిన్ ఎక్కువయితే తరచూ హెడేక్ రావడం, మైకం కమ్మడం, చూపు మందగించడం, హాట్ వాటర్‌తో స్నానం చేశాక బాడీపై తీవ్రమైన దురద పుట్టడం వంటివి బేసిక్ లక్షణాలుగా కనిపిస్తాయి . ఇలాంటి లక్షణాలతో పాటు ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే వెంటనే స్పెషలిస్ట్ డాక్టర్‌ను కన్సల్ట్ చేసి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. సమస్య ఎక్కువగా ఉంటే డాక్టర్లు స్పెషల్ ట్రీట్మెంట్ ద్వారా శరీరం నుంచి కొంత బ్లడ్‌ను తీసివేసి రక్తాన్ని డౌన్ చేస్తారు.
Liechtenstein : హైదరాబాద్ కంటే చిన్న దేశం.. కానీ ఆ విషయంలో మాత్రం ఈ కంట్రీ టాప్..
