US Visa
అగ్రరాజ్యం అమెరికాలో అడుగుపెట్టడం ఒక ఎత్తయితే, అక్కడ కండీషన్లను పాటిస్తూ జీవించడం మరో ఎత్తు. అక్కడ ఏమాత్రం తేడా వచ్చినా, చివరకు చిన్న రూల్ బ్రేక్ చేసినా అమెరికా ఏమాత్రం కనికరం చూపించదు. ఇదే విషయం ఇప్పుడు మరోసారి ప్రూవ్ అయింది.
డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా గవర్నమెంట్ ఇమ్మిగ్రెంట్లకు, విదేశీయులకు ఊహించని షాక్ ఇచ్చింది. నేషనల్ సేఫ్టీ, చట్టాల ఉల్లంఘన పేరుతో ఏకంగా 1,75,000 కంటే ఎక్కువ వీసాలను క్యాన్సిల్ చేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అమెరికా విదేశాంగ శాఖ రిలీజ్ చేసిన స్పెషల్ ఫ్యాక్ట్ షీట్‌లో ఈ వివరాలను అనౌన్స్ చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కలకలం రేగుతోంది.
ఈ భారీ వీసాల క్యాన్సిల్ వెనుక బలమైన కారణాలే ఉన్నాయని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు.. ఇమ్మిగ్రేషన్ నిబంధనలను బ్రేక్ చేయడం అలాగే మోసపూరిత డాక్యుమెంట్లతో మోసాలకు దిగడం వంటి నేరాలు చేస్తున్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు.
అంతేకాదు ఆ దేశ భద్రతకు వీరు ముప్పుగా మారడం, అలాగే ఇతరులపై హింసను ప్రేరేపించడం వంటి తీవ్రమైన కారణాల వల్ల ఆ వీసాలను రద్దు చేశారు. దర్యాప్తు సంస్థలు అందించిన పక్కా సమాచారం ప్రాతిపదికగానే ఈ కార్యక్రమం జరిగింది. వీటిలో ముఖ్యంగా డ్రింక్ అండ్ డ్రైవ్ (DUI), దాడులకు పాల్పడటం, దొంగతనాలు చేయడం, డ్రగ్స్ సప్లై వంటి క్రైమ్స్‌లో ఇరుక్కున్న వారే ఎక్కువ మంది ఉన్నారు.
కేవలం చిన్న చిన్న నేరాలే కాదు, అత్యంత తీవ్రమైన నేరాలు చేసిన వారిపై కూడా వేటు పడింది. అత్యాచారం, కిడ్నాపింగ్, మానవ అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక వేధింపుల వంటి కిరాతకాలకు పాల్పడిన వారి వీసాలను వెంటనే క్యాన్సిల్ చేశారు.
వీటితో పాటు, తమ పిల్లలకు డైరెక్టుగా అమెరికా పౌరసత్వం దక్కాలనే ప్లాన్‌తో వచ్చే బర్త్ టూరిజం వీసాలను కూడా విదేశాంగ శాఖ క్లోజ్ చేసింది. విదేశాంగ విధానాల వల్ల ఇరాన్, క్యూబా, లావోస్, కువైట్ వంటి దేశాలకు చెందిన కొంతమంది వీసాలను క్యాన్సిల్ చేసినట్లు విదేశాంగ మంత్రి వెల్లడించారు.
అయితే ఈ చర్యలు కేవలం ఏ ఒక్క దేశాన్ని కూడా టార్గెట్‌గా చేసుకుని చేసినవి కావు. చట్టాలను అతిక్రమించిన ప్రతీ ఒక్కరిపైన కూడా ఈ చర్యలు తీసుకున్నారు. అయితే, అమెరికాలో ఐటీ ఉద్యోగాలు చేసే H-1B హోల్డర్లు, అలాగే స్టూడెంట్ వీసాలపై (F-1) వెళ్లే ఫారినర్స్‌లో ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారు.
దీనిలో భాగంగా డ్రైవింగ్ అండర్ ఇన్‌ఫ్లుయెన్స్ (DUI), ఓవర్ స్పీడింగ్, లేదా ఆఫీస్ డక్యుమెంట్లలో చిన్నచిన్న పొరపాట్లు చేసిన కొంతమంది ఇండియన్స్ కూడా వీసా రద్దు ఎదుర్కొన్న వారి లిస్టులో ఉండే అవకాశం ఉంది.
Kalki 2 : ప్రభాస్ పక్కన నటించే గోల్డెన్ ఛాన్స్..కల్కి 2 మేకర్స్ బిగ్ ఆఫర్
