Just InternationalJust PoliticalLatest News

Epstein Files : బ్రిటన్ లో ఎప్‌‌స్టీన్‌‌ ఫైల్స్ కలకలం..ప్రధాని స్టార్మర్ పదవికి ఎసరు

Epstein Files : బ్రిటిష్ రాజకీయాల్లో ఎప్‌స్టీన్ మంటలు.. ప్రధాని స్టార్మర్ పదవికి ముప్పు..రేసులో షబానా మహమూద్!

Epstein Files

జెఫ్రీ ఎప్‌‌స్టీన్‌‌ కేసు కేవలం అమెరికానే కాదు ఇతర దేశాలను సైతం కుదిపేస్తున్నాయి. బ్రిటన్ లో అయితే ఏకంగా ప్రధాని పదవికే ఎసరుపెట్టింది. ఎప్‌‌స్టీన్‌‌ ఫైల్స్(Epstein Files) ప్రస్తుతం బ్రిటన్ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఈ ఆరోపణలతో ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది.

తాజాగా ఎప్‌స్టీన్ కేసులోని పత్రాలు బయటపడటంతో.. తన లేబర్ పార్టీ సీనియర్ నేత పీటర్ మాండెల్సన్‌ను అమెరికా రాయబారిగా నియమించిన.. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇప్పుడు తన పదవికే ముప్పు తెచ్చుకున్నట్లు అయింది.

సుమారు 15 ఏళ్ల క్రితం సున్నితమైన ప్రభుత్వ సమాచారాన్ని ఎప్‌స్టీన్‌కు అందించారనే ఆరోపణలపై మాండెల్సన్‌పై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఆరోపణలు రుజువైతే ఆయనకు జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారమే స్టార్మర్ మెడకు చుట్టుకుంది. స్టార్మర్ పదని నుంచి దిగిపోయినా కూడా ఆశ్చర్యం లేదు.

ఒకవేళ స్టార్మర్ రాజీనామా చేస్తే మాత్రం భారత్ బద్ద వ్యతిరేకిగా ఉన్న షబానా మహమూద్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.

అదే జరిగితే బ్రిటన్ మొట్టమొదటి ముస్లిం ప్రధానిగా ఆమె చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. షబానాతో పాటు మాజీ డిప్యూటీ పీఎం, ఏంజెలా రేనర్‌‌‌‌, హెల్త్‌‌ సెక్రటరీ వెస్ స్ట్రీటింగ్, లేబర్‌‌‌‌ పార్టీ మాజీ నేత, ఎనర్జీ సెక్రటరీ ఎడ్ మిలిబాండ్‌‌నుంచి వంటి ప్రముఖులు కూడా రేసులో ఉన్నారు. అయితే మెజారిటీ నేతలు మాత్రం షబానాకే పదవి దక్కే అవకాశంఉందని అంచనా వేస్తున్నారు.

Epstein Files
Epstein Files

45 ఏళ్ల షబానా స్వతహాగా న్యాయవాది. ఈమె తల్లిదండ్రులు మూలాలు జుబైదా, మహమ్మద్ అహ్మద్‌కి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని మీర్పూర్‌లో ఉన్నాయి. బర్మింగ్‌హామ్‌లో పుట్టిన షబానా బార్‌ వొకేషనల్‌ కోర్సు పూర్తి చేసి బారిస్టర్‌ కూడా అయ్యారు. 2010లో యూకేలో తొలిసారి ఎంపీలుగా గెలిచిన ఆమె అప్పటి నుంచీ అక్కడి రాజకీయాల్లో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే షబానా భారత్ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారు.

అసలు తమకు సంబంధమే లేని కశ్మీర్ వివాదంలో జోక్యం చేసుకుంటూ గతంలో వార్తల్లో నిలిచారు. 2019లో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు ఆమె వ్యతిరేక స్వరం వినిపించారు. అలాగే కశ్మీర్ ను ఇండియా ఆక్రమిత కశ్మీర్ గా అభివర్ణించడం కూడా తీవ్ర వివాదానికి తెరతీసింది. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ సమాజం జోక్యాన్ని కోరుతూ పలుసార్లు బ్రిటన్ పార్లమెంటులో డిమాండ్ చేయడం కూడా అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button