Iran
అమెరికా, ఇజ్రాయెల్ తో ఒంటరిగానే ధీటుగా పోరాడుతున్న ఇరాన్(Iran) తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ముఖ్యంగా అమెరికా బలగాలకు ఇరాన్ సైన్యం చుక్కలు చూపెడుతోంది. ఒకవైపు వారికి తమ సైనిక సత్తాతోనే జవాబిస్తున్న ఇరాన్ మరోవైపు తన జాతీయ నేతల హత్యలకు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటోంది.
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులపై ఊహించని ప్రతిపాదన తీసుకొచ్చింది. వీరిద్దరినీ హతమార్చిన వారికి 50 మిలియన్ యూరోలు అంటే భారత కరెన్సీలో రూ.558 కోట్ల రూాపాయలు బహుమతిగా ఇచ్చేందుకు సిద్ధమైంది. దీనిపై ఇరాన్ పార్లమెంట్ వివాదాస్పద బిల్లును కూడా రెడీ చేసినట్టు సమాచారం. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఈ వివాదాస్పద ప్రతిపాదనకు చట్టబద్ధత కల్పించేందుకు కూడా నిర్ణయించుకుంది. దీనిపై త్వరలోనే ఇరాన్ పార్లమెంట్ లో ఓటింగ్ కూడా నిర్వహించబోతున్నారు.
ఇరాన్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిటీ చైర్మన్ ఇబ్రహీం అజీజీ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఒక ప్రత్యేక ముసాయిదాను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన టెహ్రాన్‌పై జరిగిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి చెందారు. ఖమేనీ హత్యకు కారణమైన డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహులను లక్ష్యంగా చేసుకోవాలని అప్పుడే ఇరాన్ నిర్ణయించింది.
ఈ సందర్భంగా వారిద్దరినీ నరకానికి పంపించే వారికి భారీ రివార్డును అధికారికంగా ప్రకటించేందుకు చట్టసభ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కేవలం పార్లమెంట్ మాత్రమే కాకుండా ప్రభుత్వ మద్దతు ఉన్న సైబర్ వార్‌ఫేర్ గ్రూప్ ఇప్పటికే 50 మిలియన్ డాలర్ల నిధులను సేకరించినట్లు ప్రకటించాయి. గతంలో కూడా ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించడం ఎవ్వరికీ పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు.
అయితే ఇప్పుడు ఏకంగా పార్లమెంట్‌లో చట్టం తీసుకురానుండడంతో అంతా షాక్ అవుతున్నారు. ఒకవేళ ఇరాన్ పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెడితే ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం నాశనం అవుతుందని భావిస్తున్నారు.ఇదిలా ఉంటే గతంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన పలు వ్యాఖ్యలు కూడా ఇరాన్ ఆగ్రహానికి కారణమైనట్టు తెలుస్తోంది. తనపై ఇరాన్ ఎలాంటి దాడికి యత్నించినా, ఆ దేశాన్ని భూమ్మీద లేకుండా చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇరాన్ ట్రంప్, నెతన్యాహులను టార్గెట్ చేసింది.
Prince Yadav : ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ కు పిలుపు..ఆప్ఘన్ తో సిరీస్ కు భారత జట్టు ఇదే
