Just InternationalJust PoliticalLatest News

War Updates : పశ్చిమాసియాలో ముగిసిన ప్రశాంతత.. ఏ క్షణంలోనైనా యుద్ధం..

War Updates : ఇరాన్ దాడులను ముందే పసిగట్టిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెంటనే రంగంలోకి దిగి తమ వైమానిక రక్షణ వ్యవస్థలను అలెర్ట్ చేశాయి.

War Updates

పశ్చిమాసియా( War Updates)లో కొన్ని రోజులుగా కనిపించిన తాత్కాలిక ప్రశాంతత ఒక్కసారిగా ముగిసిపోయినట్లయింది. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ రాజధాని బీరూట్‌ను టార్గెట్‌ చేసుకుని దాడులు చేసిన కొద్దిసేపటికే.. ఇరాన్ కూడా ఈ ఘర్షణల్లోకి ప్రవేశించింది.

జూన్ 7 వ తేదీ రాత్రి ఇజ్రాయెల్ సరిహద్దులను టార్గెట్ చేసిన ఇరాన్.. భారీ సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడంతో అక్కడ యుద్ధ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

ఏప్రిల్ 8వ తేదీన రెండు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం తర్వాత.. ఇజ్రాయెల్ భూభాగంపై ఇరాన్ డైరెక్టుగా జరిపిన మొట్టమొదటి దాడి ఇదే కావడం విశేషం. ఈ హఠాత్తు పరిణామంతో ఉత్తర ఇజ్రాయెల్ ప్రాంతంలో డేంజర్ వార్నింగ్ సైరన్లు మార్మోగాయి.

హిజ్బుల్లా బలగాలకు ముఖ్య స్థావరంగా ఉన్న బీరూట్ దక్షిణ శివారు ప్రాంతమైన దహియేహ్‌పై… ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెగబడటమే ఇరాన్ ఆగ్రహానికి మెయిన్ రీజన్ అయింది. లెబనాన్ రాజధానిపై ఇజ్రాయెల్ దాడులు చేస్తే తాము ఏమాత్రం ఊరుకునేది లేదని టెహ్రాన్ ఇదివరకే హెచ్చరించింది.

ఇజ్రాయెల్ సైనిక చర్యల వల్ల అమెరికాతో జరగాల్సిన పరోక్ష చర్చలను కూడా ఇరాన్ మధ్యలోనే ఆపేసింది. ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య టెంపరరీ కాల్పుల విరమణను ప్రకటించినా, రెండు పక్షాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో ఆ ఒప్పందం కాస్తా పూర్తిగా వీగిపోయినట్లయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏకంగా బీరూట్ పరిసరాలను టార్గెట్ చేసుకోవడంతో ఇరాన్ తమ సహనానికి పరీక్ష పెట్టారని భావిస్తూ రంగంలోకి దిగింది.

ఈ క్షిపణి దాడుల తర్వాత ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఒక అఫీషియల్‌ ప్రకటనను రిలీజ్ చేశారు. ఇజ్రాయెల్‌కు అత్యంత కీలకమైన రామత్ డేవిడ్ ఎయిర్ బేస్‌ను ధ్వంసం చేయడమే టార్గెట్‌గా తాము ఈ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు క్లారిటీ ఇచ్చారు.

ఇరాన్ దాడులను ముందే పసిగట్టిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెంటనే రంగంలోకి దిగి తమ వైమానిక రక్షణ వ్యవస్థలను అలెర్ట్ చేశాయి. శత్రుదేశం ప్రయోగించిన మిస్సైళ్లను తమ ఎయిర్ ఫోర్స్ గాల్లోనే సమర్థవంతంగా అడ్డుకుందని ఇజ్రాయెల్ ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ దాడుల వల్ల ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తుల ధ్వంసం ఏమీ జరగలేదని ఐడీఎఫ్ వెల్లడించింది.

అయితే ఇరాన్ ఖాటమ్ అల్-అన్బియా దళాల కమాండర్ ఇజ్రాయెల్‌తో పాటు ఆ దేశానికి మద్దతుగా నిలిచే దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బీరూట్ పరిసరాల్లో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు కనుక ఇంకా విస్తరిస్తే మాత్రం తాము ఊరుకోబోమని, వెంటనే దక్షిణ లెబనాన్ , బీరూట్‌లపై దాడులను ఆపేయాలని డిమాండ్ చేశారు.

War Updates
War Updates

ఒకవేళ తమ చర్యలకు ప్రతిచర్యగా ఇజ్రాయెల్ దాడులను మరింత తీవ్రం చేస్తే మాత్రం, రాబోయే రోజుల్లో ఆ దేశంతో పాటు దానికి అండగా ఉండే దేశాలన్నీ కూడా భారీ వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ కమాండర్ హెచ్చరించారు.

ఈ తాజా మిస్సైల్ దాడులతో పశ్చిమాసియా( War Updates)లో నెలకొన్న శాంతి వాతావరణం పూర్తిగా దెబ్బతినడంతో పాటు..ఏ క్షణంలోనైనా పూర్తి స్థాయి యుద్ధం మొదలయ్యే ప్రమాదముందని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


జస్ట్ తెలుగు న్యూస్ వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.



Temple Gadapa : గుడి గడపను తొక్కకూడదా? దీని వెనుకున్న అసలు రహస్యమేంటి?

Related Articles

Back to top button