MYTA Bathukamma Celebrations : మలేషియాలో గ్రాండ్‌గా బతుకమ్మ సంబురాలు ..సముద్రం దాటిన పల్లె వేడుకలు..
MYTA Bathukamma Celebrations : మన పల్లె జానపద కళలు, సంప్రదాయాలు సరిహద్దులు దాటి ఇంటర్నేషనల్ రేంజ్లో ఎంతలా పరవశింపజేస్తాయో బతుకమ్మ సంబురాలు మరోసారి నిరూపించాయి.
MYTA Bathukamma Celebrations
మాతృభూమికి వేల మైళ్ల దూరంలో ఉన్నా కూడా..కట్టుబొట్టును మరిచిపోకుండా పురిటిగడ్డ సంస్కృతిని గుండెల్లో మోస్తున్న తెలంగాణ బిడ్డలు.. మలేషియాలో మరోసారి తామేంటో నిరూపించుకున్నారు.
కౌలాలంపూర్ వేదికగా మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) ఆధ్వర్యంలో జరిగిన 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు(MYTA Bathukamma Celebrations) – 2026 వైభవంగా ముగిశాయి. మన పల్లె జానపద కళలు, సంప్రదాయాలు సరిహద్దులు దాటి ఇంటర్నేషనల్ రేంజ్లో ఎంతలా పరవశింపజేస్తాయో ఈ సంబురాలు మరోసారి నిరూపించాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆడపడుచులు రంగురంగుల పూలను బతుకమ్మలుగా పేర్చి ముస్తాబు చేశారు. గుమ్మడి, తంగేడు పువ్వులతో బతుకమ్మను కొలువుదీర్చి.. చుట్టూ తిరుగుతూ లయబద్ధంగా పాటలు పాడుతూ చేసిన బతుకమ్మ ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పల్లెతనం ఉట్టిపడేలా సాగిన జానపద ప్రదర్శనలు విదేశీ గడ్డపై తెలంగాణ వాతావరణాన్ని అందరికీ గుర్తు చేశాయి.
ఈ సంబురాలకు కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్ ఫస్ట్ సెక్రటరీ శ్రీ రాజేష్ హెచ్. మణియిల్ ముఖ్య అతిథిగా విచ్చేసి వేడుకల్లో పార్టిసిపేట్ చేశారు. వీరితో పాటు ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ జనుల్యూరి, ప్రసిద్ధ ఫోక్ సింగర్ దిలీప్ దేవ్గన్, టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ అరుణ్ కొలుగూరి తమ పర్ఫార్మెన్సులతో స్టేజీపై సందడి చేశారు. కాగా ఈ వేడుకలలో కేసీఆర్ (KCR) పాటకు దుమ్మురేపేలా డ్యాన్స్ చేయడం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.
కేవలం ఆటపాటలే కాదు, తెలంగాణ నోరూరించే వంటకాలను కూడా ఈ ఈవెంట్లో మరోసారి అందరికీ రుచి చూపించారు. వచ్చిన అతిథులు, తెలుగు ప్రజలు తెలంగాణ వంటకాల ఘుమఘుమలను ఆస్వాదించేలా ప్రత్యేకంగా ఫుడ్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమ విజయవంతానికి GRPC Malaysia Sdn Bhd, Rapinno Tech Sdn Bhd కంపెనీలు స్పాన్సర్లుగా నిలిచాయి. అలాగే తెలంగాణ బిర్యానీ రుచులను తెలుగువారికి అందించడంలో MY81 హైదరాబాద్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ ఫుడ్ స్పాన్సర్‌గా సేవలు అందించింది. ఈ సందర్భంగా సపోర్ట్ చేసిన దాతలకు, వాలంటీర్లకు, కళాకారులకు మైటా నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

మైటా (MYTA) అధ్యక్షుడు సైదం తిరుపతి నాయకత్వంలో, వైస్ ప్రెసిడెంట్ చిరుత చిట్టిబాబు, మహిళా అధ్యక్షురాలు కిరణ్మయి దండెబోయిన, ప్రధాన కార్యదర్శి సందీప్ గౌడ్, సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ రావు నడిపెల్లి, ట్రెజరర్ సందీప్ కుమార్ లగిశెట్టి, సంయుక్త కోశాధికారి సుందర్ రెడ్డి మోర్తాల, యూత్ ప్రెసిడెంట్ సంతోష్ దాసరాజు, యూత్ వైస్ ప్రెసిడెంట్ పోలాది శివ తేజతో పాటు ఎగ్జిక్యూటివ్ టీమ్ ఈ ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది.
ఎక్కడ ఉన్నా మన మూలాలను, ఆచార వ్యవహారాల వారసత్వాన్ని రాబోయే తరాలకు సగర్వంగా అందించడమే తమ ఆశయమని మైటా ప్రతినిధులు చెప్పారు. మొత్తంగా మన బతుకమ్మ – మన సంస్కృతి – మన తెలంగాణ – వన్ మైటా అనే స్లోగన్‌తో జరిగిన 13వ గ్రాండ్ బతుకమ్మ సంబరాలు విజయవంతంగా పూర్తయ్యాయి.
కౌలాలంపూర్‌లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) ఆధ్వర్యంలో 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు – 2026 ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, బతుకమ్మ పాటలు, జానపద కళలతో మలేషియా వేదికగా ప్రపంచానికి చాటేలా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
#Bathukamma #justtelugu #Bathukamma2026 https://t.co/3ypsHgtiD4— Just Telugu News (@NewsJust97938) October 19, 2026





