PM Modi
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఒక ఎఫ్బీ వీడియో పోస్ట్ అకస్మాత్తుగా మాయమైపోవడం, ఆ తర్వాత దాన్ని తిరిగి కనిపించేలా చేయడంతో కేంద్ర ప్రభుత్వం, సోషల్ మీడియా దిగ్గజం మెటా మధ్య పెద్ద రచ్చ లేపిన విషయం తెలిసిందే. పేపర్ లీకులపై కఠిన చర్యలు ఉంటాయంటూ యూత్‌కు మెసేజ్ ఇస్తూ ప్రధానిమోదీ(PM Modi) పోస్ట్ చేసిన వీడియోను ఫేస్‌బుక్ నుంచి తొలగించడంతో పొలిటికల్ రగడ మొదలయింది.
దీనిపై మెటా క్లారిటీ ఇస్తూ అది టెక్నికల్ గ్లిచ్ అని సరిపెట్టుకునే ప్రయత్నం చేసినా, ఐటీ మినిస్ట్రీ మాత్రం ఆ ఆన్సర్‌తో అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. దీనిలో భాగంగానే ఢిల్లీ వేదికగా కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మెటా గ్లోబల్ టీమ్ ఈరోజు అత్యవసరంగా భేటీ అయింది.
ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఈ హై-లెవల్ సమావేశంలో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్లాట్‌ఫామ్ మేనేజ్‌మెంట్‌లో జరిగిన బ్లండర్ మిస్టేక్స్‌తో పాటు చిన్నారుల లైంగిక దుర్వినియోగ కంటెంట్ (సీఎస్‌ఏఎం), డీప్‌ఫేక్‌ల వ్యాప్తిపై సోషల్ మీడియాలో జరిగిన పొరపాట్లకు క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.
మెటా గ్లోబల్ అఫైర్స్ బాస్ జోయెల్ కాప్లన్ తన బృందంతో వచ్చి మినిస్టర్‌తో పాటు ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్‌తో విడివిడిగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇండియాలోని ఐటీ చట్టాల పట్ల సోషల్ మీడియా కంపెనీలకు ఎంత రెస్పాన్సిబులిటీ ఉందో సెంటర్ క్లియర్‌గా కట్ అండ్ రైట్‌గా వివరించింది.
ఏ కంటెంట్ ఎవరికి చూపించాలో మీ అల్గారిథమ్స్ ద్వారా మీ అంతట మీరే డిసైడ్ చేస్తున్నప్పుడు, మిమ్మల్ని కేవలం ఒక థర్డ్ పార్టీ ఇంటర్మీడియర్‌గా మాత్రమే చూడలేమంటూ.. దాంతో ఐటీ యాక్ట్ కింద లభించే సేఫ్ హార్బర్ లీగల్ ప్రొటెక్షన్ మీకు వర్తించదని కేంద్రం గట్టిగానే క్లాస్ పీకింది.
ఈ మీటింగ్‌లో మెటా ప్రతినిధులు కూడా కొంత కంటెంట్‌ను ప్రమోట్ చేసుకోవడానికి భారీగా ఫండ్స్ ఖర్చు చేసిన విషయాన్ని ఓపెన్‌గా యాక్సెప్ట్ చేస్తూ, జరిగిన ఇన్సిడెంట్స్‌పై తీవ్ర విచారం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పెయిడ్ అడ్వర్టైజ్‌మెంట్స్ రూపంలో చైల్డ్ అబ్యూస్ కంటెంట్ ప్రచారమవ్వడంపై ఆల్రెడీ నోటీసులు ఇచ్చామన్న కేంద్రం, ఏఐ బేస్డ్ డీప్‌ఫేక్‌లను కంట్రోల్ చేసే కొత్త మెకానిజమ్స్ మీ దగ్గర ఏమున్నాయని మెటాని నిలదీసింది.
గ్లోబల్ టెక్ దిగ్గజంగా ఉన్న మెటా దగ్గర ఇలాంటి ప్రాబ్లమ్స్ అడ్డుకునే టెక్నికల్ క్యాపబిలిటీస్ ఉన్నా కూడా , పదే పదే ఇలాంటి వైఫల్యాలు రీపీట్ అవడానికి గల రీజన్స్ తెలుసుకోవడానికే ఈ సిరీస్ ఆఫ్ మీటింగ్స్ అని ఐటీ సెక్రటరీ వివరించారు.
ఇది కేవలం ఒక గ్లిచ్ మాత్రమే కాదని, నేషనల్ సెక్యూరిటీ , పబ్లిక్ ఆర్డర్‌కి సంబంధించిన సీరియస్ ఇష్యూ అని హోమ్ వర్గాలు భావిస్తున్నాయి. అల్గారిథమిక్ బయాస్ ఉందా లేదా అనే దానిపై వివరణ ఇస్తూనే, ఇకపై ప్రధాని మోదీ(PM Modi)వంటి టాప్ విఐపీలు, వెరిఫైడ్ ప్రొఫైల్స్ పోస్టుల డిలీషన్స్ ఇష్యూలో మల్టీ-లెవల్ సీనియర్ ఆఫీసర్స్ రివ్యూ తప్పనిసరి అని చెబుతూ ఒక కొత్త సెక్యూరిటీ ప్రోటోకాల్ లాంచ్ చేసినట్లు మెటా ఒక ప్రైవేట్ లెటర్ ద్వారా ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసింది.
మరోవైపు పార్లమెంటరీ ప్యానెల్ కూడా ఈ ఇన్సిడెంట్‌పై చాలా సీరియస్ అయింది. మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా పబ్లిక్‌గా సారీ చెప్పాలని.. 3 రోజుల్లో సారీ చెప్పకపోతే వారికి ఉన్న లీగల్ ప్రొటెక్షన్‌ను రద్దు చేసే అంశాన్ని పరిశీలించాలంటూ అధికారులను ఆదేశించింది. మరి దీనిపై మెటా నుంచి ఎలాంటి అఫీషియల్ మూవ్ ఉంటుందో వేచి చూడాలి.
Vijay Govt : జెన్ జీ, విద్యార్థులకే ప్రాధాన్యత ..విజయ్ ప్రభుత్వం తొలి బడ్జెట్ ఎలా ఉంది?
