Vijay Govt : జెన్ జీ, విద్యార్థులకే ప్రాధాన్యత ..విజయ్ ప్రభుత్వం తొలి బడ్జెట్ ఎలా ఉంది?
Vijay Govt : విజయ్ సాధించిన ఈ విజయంలో జెన్ జీ, విద్యార్థుల పాత్రే కీలకం. అందుకే తన పాలనలో విజయ్ కూడా వారికి మంచి ప్రాధాన్యతే ఇస్తున్నారు.
Vijay Govt
తమిళనాడులో టీవీకే పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం యువతే. తమిళనాడు ఎన్నికల్లో మార్పు కోరుకున్న యువత, ఫస్ట్ టైమ్ ఓటు హక్కు పొందిన ఓటర్లు విజయ్ పార్టీ వైపు నిలిచారు. సోషల్ మీడియా, వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా జెన్ జీ యువత.. విజయ్ క్యాంపెయిన్‌ను ముందుకు నడిపించారు.
అందుకే ఎవ్వరూ ఊహించని విధంగా సీట్లు గెలిచి సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టారు. విజయ్ సాధించిన ఈ విజయంలో జెన్ జీ, విద్యార్థుల పాత్రే కీలకం. అందుకే తన పాలనలో విజయ్ కూడా వారికి మంచి ప్రాధాన్యతే ఇస్తున్నారు. తాజాగా విజయ్ సర్కార్(Vijay Govt) ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో ఇది స్పష్టంగా కనిపించింది.
చాలా కీలక హామీలు ఇచ్చిన విజయ్ ప్రభుత్వం(Vijay Govt) తమ తొలి బడ్జెట్‌లో ఏ శాఖలకు ఎలా కేటాయింపులు చేస్తుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఊహించినట్టుగానే ఈ బడ్జెట్‌తో విజయ్ ఎక్కువగా జెన్ జీ, విద్యార్థులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. వారి సంక్షేమంపైనే ప్రధాన దృష్టి సారించారు. ముఖ్యంగా యువత సాధికారత, ఆధునిక నైపుణ్యాలు ,విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు పెద్దపీట వేశారు.
తొలి బడ్జెట్‌లో విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత లభించింది. పాఠశాల విద్యాశాఖ కోసం రూ.44,527 కోట్లు కేటాయించారు. అదే సమయంలో ఉన్నత విద్యాశాఖకు రూ.8393 కోట్లు కేటాయించారు. జెన్ జీ యువతలో భాగంగా కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందించే వెట్రి లాప్‌టాప్ పథకానికి రూ.2 వేల కోట్లు కేటాయించారు.
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 11వ తరగతి చదువుతున్న 5 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఉచిత సైకిళ్లు, హెల్మెట్, వాటర్ బాటిల్ కోసం రూ.277 కోట్లు కేటాయించారు. యువత సంక్షేమం కోసం విజయ్ భారీగా కేటాయింపులు చేశారు. వారి కోసం రూ.1051 కోట్లు వెచ్చించనున్నట్టు తెలిపారు.

క్వాంటమ్ కంప్యూటింగ్, స్పేస్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక కోర్సులపై దృష్టి పెట్టాలని విజయ్ సర్కార్ ఇప్పటికే విద్యాసంస్థలకు సూచనలు చేసింది. దీనిలో భాగంగానే విద్యావ్యవస్థల్లోని కోర్సులకు సంబంధించి సంస్కరణలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థుల కోసం కీలక కేటాయింపులు కూడా విజయ్(Vijay) సర్కార్ చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి కాలేజీల్లో చేరే విద్యార్థులకు వన్ టైమ్ ఆర్థిక సాయం పథకం కింద రూ.8 వేలు అందజేయనున్నారు. అలాగే వారికి రిజర్వేషన్‌ను కూడా 7.5 శాతం నుంచి 10 శాతానికి పెంచాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడంపై తమిళనాడు గవర్నమెంట్ ఫోకస్ పెట్టనుంది.
Cortisol : అర్థరాత్రులు మెలకువ వస్తుందా? మీ బాడీని శాసిస్తున్న ఆ ఒక్క హార్మోన్ సీక్రెట్ అదే..





