Just InternationalLatest News

Bermuda Triangle : బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం .. దశాబ్దాల మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు

Bermuda Triangle: బెర్ముడా దీవులు సముద్ర మట్టానికి 1,600 అడుగుల ఎత్తులో, నిలకడగా ఎలా తేలుతున్నాయనేదే దశాబ్దాలుగా సైంటిస్టులకు అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయింది.

Bermuda Triangle

బెర్ముడా ట్రయాంగిల్(Bermuda Triangle) అనగానే మనందరికీ గుర్తొచ్చేది మనుషులను, ఓడలను అమాంతం మింగేసే ఒక అదృశ్య శక్తి. కానీ,దీనిని కాసేపు పక్కన పెడితే.. సముద్రపు అగాధంలో కోట్ల సంవత్సరాలుగా దాగున్న ఒక భౌగోళిక అద్భుతమే.. ఇప్పుడు శాస్త్రవేత్తలను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

అగ్నిపర్వతాలు బద్దలైతేనే సముద్రం మధ్యలో దీవులు ఏర్పడతాయన్న విషయం తెలిసిందే.. ఆ యాక్టివిటీ ఆగిపోయాక కాలక్రమేణా అవి నీటిలోకి కుంగిపోవడమనేది ప్రకృతి నియమం. అయితే 3 కోట్ల ఏళ్లుగా ఎలాంటి అగ్నిపర్వత విస్పోటనాలు లేకపోయినా.. బెర్ముడా దీవులు(Bermuda Triangle) మాత్రం సముద్ర మట్టానికి 1,600 అడుగుల ఎత్తులో, నిలకడగా ఎలా తేలుతున్నాయనేదే దశాబ్దాలుగా సైంటిస్టులకు అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయింది.

అయితే తాజాగా అంతర్జాతీయ పరిశోధకులు భూమి అంతర్భాగంలోకి సైస్మిక్ తరంగాలను పంపి, ఆ రహస్యాన్ని పూర్తిగా ఛేదించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కార్నెగీ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ సైన్స్‌కు చెందిన విలియం ఫ్రేజర్‌తో పాటు యేల్ యూనివర్సిటీ శాస్త్రవేత్త జెఫ్రీ పార్క్ ఆధ్వర్యంలోని రీసెర్చ్ టీమ్ సరికొత్త పరిశోధనలు ప్రారంభించింది.

భూకంపాలు వచ్చినప్పుడు బయటకు వచ్చే సైస్మిక్ తరంగాల (Seismic Waves) వేగాన్ని, అవి ప్రయాణించే మార్గాలను బట్టి భూమి లోపల ఏ రకమైన పదార్థాలున్నాయో అంచనా వేయొచ్చు. బెర్ముడాలోని సిస్మిక్ అబ్జర్వేటరీ డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు, ఆ దీవి కింద సుమారు 25 కిలోమీటర్ల లోతు వరకు ఉన్న భూగర్భ చిత్రాన్ని (Subsurface Mapping) ఆవిష్కరించారు. దీనిలో ఒక అద్భుతమైన నిజం బయటపడింది.

Bermuda Triangle
Bermuda Triangle

బెర్ముడా దీవి కింద, భూమి పైపొర లోపల దాదాపు 12 మైళ్ల మందంతో కూడిన ఒక ప్రత్యేకమైన శిలాపొర (Rock Layer) దాగి ఉందని సైంటిస్టులు గుర్తించారు. ఈ రాతి పొర డెన్సిటీ (Density), దాని చుట్టూ ఉన్న మ్యాంటిల్ పొర కంటే చాలా తక్కువగా ఉన్నట్లు తేల్చారు. సాంద్రత తక్కువగా ఉండటం వల్లే దీనికి అసాధారణమైన రీతిలో నీటిపై తేలియాడే గుణం (Buoyancy) లభించిందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.

అంటే ఇది ఒక పెద్ద బల్లకట్టు, ఫ్లోటింగ్ ప్లాట్ ఫారమ్ లా పనిచేస్తూ బెర్ముడా దీవి కిందకు కుంగిపోకుండా పైకే నెడుతూ రక్షిస్తోందని సైంటిస్టులు తేల్చారు. సైన్స్ లాంగ్వేజ్‌లో దీనిని అండర్‌ప్లేటింగ్ (Underplating) అని పిలుస్తారు. మొత్తంగా కోట్ల సంవత్సరాల క్రితం ఇక్కడ అగ్నిపర్వతాలు యాక్టివ్‌గా ఉన్నప్పుడు, భూ అంతర్భాగం నుంచి పైకి వచ్చిన లావా చల్లబడటంతోనే.. ఈ అరుదైన రాతిపొర ఏర్పడి ఉండొచ్చని సైంటిస్టులు నిర్ధారించారు.

Vitamin B12 : విటమిన్ బి12 లోపం..సైలెంట్ కిల్లర్ అని తెలుసుకోండి..

Related Articles

Back to top button