Trump:నేనే వెనెజులా అధ్యక్షుడిని.. ట్రంప్ సంచలన పోస్ట్ వెనుక అసలు నిజమేంటి?

Trump: ట్రంప్ తన వివాదాస్పద పోస్టులతోనే తన అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో దిట్ట అని చాలాసార్లు నిరూపించుకున్నారు.

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) ..మరోసారి తనదైన శైలిలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో తాను వెనెజులా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్లు ..ఒక వికీపీడియా స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేయడంతో అంతర్జాతీయ సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఈ పోస్ట్ లో జనవరి 2026 నుండి డొనాల్డ్ జె. ట్రంప్ వెనెజులా యాక్టింగ్ ప్రెసిడెంట్ అని రాసి ఉంది. అయితే ఇది నిజంగా వికీపీడియాలో వచ్చిన సమాచారమా లేక ట్రంప్ సృష్టించిన నకిలీ ఇమేజా అనే చర్చ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీని వెనుక ఉన్న అసలు నిజాలను పరిశీలిస్తే, ఇది ట్రంప్ మార్క్ ‘డిప్లొమాటిక్ ట్రోలింగ్’ అని స్పష్టమవుతోందంటున్నారు విశ్లేషకులు.

మొదటగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. వికీపీడియాలో గానీ లేదా మరే ఇతర అధికారిక అంతర్జాతీయ సంస్థల్లో గానీ ట్రంప్(Trump) వెనెజులా అధ్యక్షుడు అనే సమాచారం ఎక్కడా లేదు. అది కేవలం పూర్తిగా ట్రంప్ టీమ్ రూపొందించిన ఒక ఫేక్ వికీపీడియా ఇమేజ్ మాత్రమే.

వెనెజులాలో నిరంకుశ పాలకుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేశాక..ఆ దేశాన్ని విముక్తి చేశామని చెప్పడానికి ట్రంప్(Trump).. ఈ ప్రొపగాండాను వాడుకున్నట్లు తెలుస్తోంది. ఇది తన మద్దతుదారులకు ‘అమెరికా ఫస్ట్’ పాలసీ ఎంత బలంగా పనిచేస్తుందో చూపించడానికి ట్రంప్ వేసిన ఒక ఎత్తుగడ. ట్రంప్ ఇలాంటి వివాదాస్పద పోస్టులతోనే తన అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో దిట్ట అని చాలాసార్లు నిరూపించుకున్నారు.

ఈ పోస్ట్ వెనుక అనేక కోణాలు ఉన్నాయి. ఒకటి వెనెజులా ప్రస్తుత పాలకులపై మానసిక ఒత్తిడిని పెంచడం. నేనే ప్రెసిడెంట్ అని జోక్ చేయడం ద్వారా అక్కడి మిలిటరీని , రాజకీయ నాయకులను ట్రోల్ చేయడం ట్రంప్ మెయిన్ టార్గెట్.

ఇక రెండోది అమెరికాలోని డొమెస్టిక్ పాలిటిక్స్. తన రిపబ్లికన్ ఓటర్లను ఉత్సాహపరచడానికి, ముఖ్యంగా కమ్యూనిజం అంటే పడని హిస్పానిక్ అమెరికన్ల మద్దతును కూడగట్టడానికి ట్రంప్ ఈ ప్రయత్నం చేశారు. అయితే అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒక దేశ అధ్యక్షుడు.. మరో దేశానికి తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకోవడమనేది తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. చైనా, రష్యా వంటి దేశాలు దీనిని ‘అక్రమ చొరబాటు’గా ఖండిస్తున్నాయి.

Trump

ట్రంప్ తీసుకునే ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట వేయడం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కష్టంగా మారింది. అమెరికా కాంగ్రెస్ లో రిపబ్లికన్ల మెజారిటీ ఉండటం, కోర్టులు కూడా ఎగ్జిక్యూటివ్ పవర్స్ విషయంలో ట్రంప్‌నకు అనుకూలంగా ఉండటంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది.

గతంలో ఇరాన్ డీల్ నుంచి బయటకు రావడం లేదా సులేమానీపై డ్రోన్ దాడి చేయడం వంటి సందర్భాల్లో కూడా ట్రంప్ ఎవరినీ సంప్రదించకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు వెనెజులా విషయంలో కూడా ఐక్యరాజ్యసమితి (UN) అభ్యంతరాలను ఆయన బేఖాతరు చేస్తున్నారు.

ట్రంప్ చేసిన ఈ ఒక్క పోస్ట్ గ్లోబల్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటిటకే వెనెజులాలో ఉన్న భారీ చమురు నిల్వలపై అమెరికా పెత్తనం పెరిగే అవకాశం ఉండటంతో.. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా అస్థిరంగా మారాయి. వెనెజులాలోని మదురో మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేసే అవకాశం కూడా ఉంది.

ఇది కేవలం ఒక హాస్యాస్పదమైన పోస్ట్ లా కనిపిస్తున్నా..దీని వెనుక ప్రపంచ చమురు మార్కెట్ ను శాసించాలనే పెద్ద స్కెచ్ ఉంది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ట్రంప్ మరోసారి ప్రపంచ మీడియాను తన చుట్టూ తిప్పుకోవడంలో సఫలమయినట్లే తెలుస్తోంది.

Senior citizen:వృద్ధుల ఒంటరితనాన్ని తరిమికొట్టే డే కేర్ సెంటర్లు..డబ్బులకు కాదు ఫ్రీగానే..ఎలా అప్లై చేయాలంటే..

Exit mobile version