Just InternationalJust PoliticalLatest News

Trump, Putin And Xi Jinping : అణ్వాయుధాల ముప్పుపై ఒక్కటైన ట్రంప్, జిన్‌పింగ్,పుతిన్..

Trump, Putin And Xi Jinping : చైనాలోని షెన్‌జెన్ వేదికగా అమెరికా, చైనా, రష్యా అధ్యక్షులు ముగ్గురూ కలిసి అణ్వాయుధాల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు ప్రపంచ భద్రతపై 4 ప్రధాన అంశాలతో ఉమ్మడి ప్రకటన చేశారు.

Trump, Putin And Xi Jinping

ప్రపంచ భవిష్యత్తును మార్చే దిశగా అంతర్జాతీయ పాలిటిక్స్‌లో మరొక మైలురాయి వంటి పరిణామం నమోదైంది. చైనాలోని ప్రముఖ టెక్ సిటీ షెన్‌జెన్ వేదికగా నవంబర్ 19వ తేదీ గురువారం జరిగిన చారిత్రాత్మక త్రైపాక్షిక సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌(Trump, Putin And Xi Jinping) పాల్గొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అణ్వాయుధాల భయాందోళనలను తగ్గించడమే టార్గెట్‌గా 3 అగ్రరాజ్యాలు కలిసి పనిచేయాలని ఈ భేటీలో ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ కీలక సమావేశం తర్వాత 3 దేశాల అధినేతలు నాలుగు ప్రధానాంశాలతో కూడిన సంచలన ఉమ్మడి ప్రకటనను రిలీజ్ చేశారు.

ఈ హిస్టారికల్ డిక్లరేషన్‌లో ముఖ్యంగా అణుయుద్ధం వల్ల కలిగే వినాశనం గురించి ఈ ముగ్గురు నేతలు ప్రస్తావించారు. అణు యుద్ధంలో ఎవరూ విజేతలుగా నిలవరని, అసలు అలాంటి విపత్కర పరిస్థితి ఎప్పటికీ రాకూడదని ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ తేల్చిచెప్పారు.

అణ్వాయుధాల విస్తరణకు అడ్డుకట్ట వేయడం, టెక్నికల్ డేంజర్స్‌ను  నివారించడం కోసం ముగ్గురి మధ్య రౌండ్ టేబుల్ చర్చలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే తమ వద్ద ఉన్న అణ్వాయుధాల నెంబర్స్‌ను తగ్గించుకోవడంపై ఎటువంటి కచ్చితమైన డెడ్‌లైన్లు లేదా టార్గెట్‌ను మాత్రం వీరు ప్రకటించలేదు.

దీనితో పాటు ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఐక్యరాజ్యసమితిలో సమూల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. ప్రపంచ శాంతికి, భద్రతకు ఎదురవుతున్న ఛాలెంజెస్‌ను ధీటుగా ఎదుర్కొనేలా ఐక్య రాజ్య సమితి రూపురేఖలను మార్చాలని డిమాండ్ చేశారు. మరోవైపు గ్లోబల్ మార్కెట్‌లో శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతను పెంచడానికి కలిసికట్టుగా అడుగులు వేయాలని నిర్ణయించారు.

ఉమ్మడి భేటీకి ముందే అధ్యక్షుడు ట్రంప్.. పుతిన్, జిన్‌పింగ్‌లతో(Trump, Putin And Xi Jinping) వేర్వేరుగా సమావేశం జరిపారు. రష్యా , ఉక్రెయిన్ సంక్షోభం, ఫెంటానిల్ ప్రాబ్లెమ్స్‌పై జిన్‌పింగ్‌తో ట్రంప్ మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఆశ్చర్యకరంగా ఈ జాయింట్ స్టేట్‌మెంట్‌లో ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాల ప్రస్తావనను మాత్రం తీసుకురాలేదు. అలాగే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) వంటి సంస్థలు తమ పరిధిని దాటి వ్యవహరించకూడదని వీరి అనౌన్స్‌మెంట్‌ ద్వారా స్పష్టం చేశారు.

Opportunists : మీ చుట్టూ ఉన్న అవకాశవాదులను ఇట్టే గుర్తించడం ఎలా? ఈ సైకలాజికల్ ట్రిక్స్ తెలుసుకోండి

Related Articles

Back to top button