Just InternationalLatest News

Trump: హమ్మయ్య షట్ డౌన్ ముగిసింది..  ఫండింగ్ బిల్లుకు ఆమోదం

Trump: డెమొక్రాట్లు తమ మొండి వైఖరిని వీడకపోవడంతో సెనేట్‌లో బిల్లు పాస్ కాలేదు.

Trump

అమెరికాను కుదిపేసిన ప్రభుత్వం షట్ డౌన్ కు తెరపడింది. సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఫండింగ్ బిల్లుపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అగ్రరాజ్యం చరిత్రలోనే అత్యధికంగా 43 రోజుల పాటు ప్రభుత్వం షట్ డౌన్ కొనసాగింది. రిపబ్లికన్ల ఆధ్వర్యంలో ఉన్న ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు 222-209 ఓట్ల తేడాతో ఆమోదం లభించింది.

అది జరిగిన కొద్ది గంటల్లోనే ట్రంప్(Trump) సంతకం చేయగా.. సెనేట్ కూడా ఆమోదం తెలిపింది. ఫలితంగా షట్ డౌన్ ముగిసి తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సుదీర్ఘ ప్రభుత్వ ప్రతిష్టంభన ముగిసిన వెంటనే ట్రంప్ (Trump)కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎప్పటికీ బలవంతపు వసూళ్లకు లొంగిపోమంటూ వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిస్పందనగా రిపబ్లికన్ చట్టసభ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

గతంలో ఫెడరల్ నిధులకు సంబంధించిన బిల్లుకు సెనేట్‌లో ఆమోదం లభించలేదు. ఈ కారణంగా సెప్టెంబర్ 30వ తేదీ అర్ధరాత్రి నుంచి అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ మొదలైంది. డెమొక్రాట్లు తమ మొండి వైఖరిని వీడకపోవడంతో సెనేట్‌లో బిల్లు పాస్ కాలేదు. దీంతో నిరవధికంగా ప్రభుత్వ షట్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు వైట్‌హౌస్ తెలిపింది. షట్ డౌన్ అమెరికాలో కొత్తేమీ కాదు.

Trump
Trump

గతంలో ట్రంప్ (Trump)అధ్యక్షుడిగా ఉన్నప్పుడే షట్ డౌన్ జరిగింది. కానీ ఈ సారి మాత్రం సుధీర్ఘంగా సాగింది. తొలిసారి 43 రోజుల పాటు అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ కొనసాగింది. ఫలితంగా అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వచ్చింది. ఈ రికార్డుస్థాయి షట్‌డౌన్ దెబ్బతో లక్షలాది మంది అమెరికన్ల జీవితాలు సంక్షోభంలో పడిపోయాయి. షట్‌డౌన్ సమయంలో జీతం లేకుండా పని చేసిన ఫెడరల్ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు..

ముఖ్యంగా విమానయాన రంగం, టూరిజంలపై షట్ డౌన్ ఎఫెక్ట్ గట్టిగా పడింది. భారీ స్థాయిలో సిబ్బంది జీతాలు లేక, అనారోగ్య వంటి కారణాలతో విధులకు రాలేదు. దీంతో దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ఒకదశలో భారీ స్థాయిలో విమాన సేవలను కూడా రద్దు చేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకూ 65 వేల కోట్ల సంపద ఆవిరైనట్టు అమెరికా ఆర్థిక అధికారులు అంచనా వేస్తున్నారు.

Red Fort Terrorists: 32 చోట్ల విధ్వంసానికి స్కెచ్..  దర్యాప్తులో సంచలన విషయాలు

Related Articles

Back to top button