Just InternationalJust PoliticalLatest News

Iran : పశ్చిమాసియాలో భీకర యుద్ధం.. అటకెక్కిన అమెరికా,ఇరాన్ శాంతి ఒప్పందం

Iran : ఇరాన్ సైన్యం హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు చేయడం, జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించిన్నప్పటి నుంచీ అమెరికా దూకుడుగా వ్యవహరిస్తోంది.

Iran

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. అమెరికా , ఇరాన్ దేశాలు దాడులు తీవ్రతరం చేశాయి. దీంతో రెండు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం పూర్తిగా అటకెక్కినట్లు అయింది. మొన్నటి వరకూ అర్థరాత్రి లేదా తెల్లవారుజామున మాత్రమే అమెరికా దాడులు చేస్తుండగా…ఇపుడు పగలు కూడా క్షిపణులతో విరుచుకుపడుతోంది.

తాజాగా అమెరికా చేసిన దాడుల్లో ఇరాన్ సైనికులు మృతి చెందారు. దాదాపు 300 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే హర్మూజ్ జలసంధిపై తాము పూర్తిగా పట్టు సాధించామని అమెరికా చెబుతోంది. ఇరాన్ సైన్యం హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు చేయడం, జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించిన్నప్పటి నుంచీ అమెరికా దూకుడుగా వ్యవహరిస్తోంది.

ఇరాన్ ఓడరేవుల నుంచి వచ్చే, వెళ్లే నౌకలను అడ్డుకోవడానికి అమెరికా రక్షణ దళాలు ఓమన్ గల్ఫ్, అరేబియా సముద్ర ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా మోహరించాయి. హర్మూజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో లేదని, తాము అంతర్జాతీయ నౌకల ప్రయాణానికి రక్షణ కల్పిస్తున్నామని అమెరికా ప్రకటించింది.

కొద్దిరోజుల్లోనే వందలాది చమురు నౌకలు తమ దళాల రక్షణలో ఈ మార్గాన్ని దాటాయని యూఎస్ కమాండ్ పేర్కొంది.. కాగా పగటి పూట కూడా దాడులు చేస్తామని ట్రంప్ ఇటీవలే ప్రకటించారు. తాజాగా ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా దాడులతో విరుచుకుపడింది. అమెరికా సైన్యం ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై వరుసగా భీకర వైమానిక దాడులను నిర్వహించింది.

Iran
Iran

ఇరాన్(Iran) ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలు, డ్రోన్ తయారీ కేంద్రాలు , నౌకలపై దాడులకు ఉపయోగించే క్షిపణి స్థావరాలను అమెరికా ధ్వంసం చేసింది. బందర్ అబ్బాస్ నేవల్ బేస్‌తో పాటు కీలక మెరైన్ కంట్రోల్ టవర్, చాబహార్ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుంది.

కాగా అమెరికా తన సైనిక చరిత్రలోనే మొదటిసారిగా అత్యాధునికమైన మానవరహిత డ్రోన్ బోట్లను రంగంలోకి దించింది. ఇరాన్ వెనక్కి తగ్గి చర్చలకు రాకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఇరాన్ మొండికేస్తే విద్యుత్ కేంద్రాలు, వంతెనలతో పాటు ఇరాన్‌లోని అత్యంత రహస్య భూగర్భ అణు కేంద్రమైన పికాక్స్ మౌంటెన్‌పై కూడా దాడులు చేస్తామని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు.

Child Psychology : చిన్న పిల్లలకు అద్దం చూపిస్తే మాటలు రావా?..చైల్డ్ సైకాలజీ ఏం చెబుతోంది?

Related Articles

Back to top button