just AnalysisJust LifestyleLatest News

Rohini: అబ్బాయిలు బియ్యం పెడితే అన్నం ఉడకదా? ఈ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా?

Rohini: సొసైటీలో చాలా కామన్‌గా కనిపించే ఎన్నో విషయాలు.. రోహిణి ప్రశ్నలతో అర్రే ఇది నిజమే కదా..ఇన్నాళ్లూ దీని గురించి ఆమెలా ఇంత లోతుగా ఎందుకు ఆలోచించలేకపోయాం అనేలా చేశాయి.

Rohini

ఒకరి మీద ఒక అభిప్రాయం రావడానికో.. లేక వారిపై గౌరవం పెరగడానికో ప్రత్యేకమైన కారణాలుండకపోవచ్చు. కానీ వాళ్లు చేస్తున్న పనులలోనో, మాట్లాడిన మాటలలోనో వారి ఆలోచన, సంస్కారం గురించి తెలిస్తే అమాంతం వారిమీద మన దృక్పథం మారిపోతుంది. అంతవరకూ వారిపై ఒక అభిప్రాయంతో ఉన్న మనం ఒక్కసారిగా వారి వ్యక్తిత్వానికి నమస్కారం పెడతాం. సీనియర్ నటి రోహిణి(Rohini) విషయంలోనూ బహుశా చాలామందికి ఇదే అనుభవం ఎదరయి ఉంటుంది.

ఎందుకంటే సాధారణంగా నటీమణులు వేదికలపైకి వస్తే ఆర్గనైజర్స్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతారని లేదా పార్టీలనో, వ్యక్తులనో పొగుడుతారని అందరూ అనుకుంటారు. కానీ విశాఖ సీఐటీయూ మహాసభల్లో ఇటీవల నటి రోహిణి(Rohini) ఇచ్చిన స్పీచ్ మాత్రం ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేసింది. దీనికి కారణం లేకపోలేదు.. ఆమె ఏ అజెండాతోనో లేదా ఎవరినో మెప్పించడానికో మాట్లాడలేదు.

మన ఇళ్లలో, మన వంటగదుల్లో ప్రతిరోజూ మనం చూస్తూ కూడా చూడనట్లు వదిలేస్తున్న అసమానతను ఆ సీఐటీయూ నేతల ముందే ఎండగట్టారు. నవ్వుతూ మాట్లాడుతూనే సొసైటీలో పాతుకుపోయిన అమ్మాయిలపై చిన్నచూపు గురించి సమాజాన్ని, ముఖ్యంగా మార్పు గురించి మాట్లాడే మేధావులను కడిగిపారేసిన తీరుకు నిజంగా ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

అందుకేనేమో నాలుగు రోజులయినా ఇంకా ఆ మాటల వేడి చల్లారనట్లు రోహిణి సొసైటీపై సంధించిన ప్రశ్నలు సోషల్ మీడియాలో సూటిగా ఒక్కొక్కరికీ తగులుతూనే ఉన్నాయి.

మగవారి కంటే మహిళలే ముఖ్యంగా తల్లులు వారికి తెలియకుండానే వివక్షకు పునాది వేస్తున్నారంటూ.. రోహిణి తన మాటలలో చాలా ఇంపార్టెంట్ అండ్ కీ పాయింట్ చెప్పారు. ఇంట్లో ఒక పని ఉంటే అది అమ్మాయి చేయాలి, అబ్బాయి చేయకూడదు అని అమ్మలే నేర్పిస్తారన్న సున్నితమైన అంశాన్ని మరోసారి ఎత్తి చూపారు.

Rohini
Rohini

నిజమే అబ్బాయి వంట చేస్తానంటే వద్దురా.. అది ఆడపిల్లల పని అని ఆపే తల్లి, తనకు తెలీకుండానే తన కొడుకులో ఒక అసమర్థుడిని , అలాగే మేల్ డామినేటింగ్ నేచర్‌ను పెంచేస్తుంది.అంతెందుకు ఎంత ఎడ్యుకేట్ అయిన పేరెంట్స్ అయినా వాళ్ల పిల్లలలో అబ్బాయి ఉంటే గన్స్, ట్రెయిన్,కారు, విమానాల బొమ్మలు, అదే ఆడపిల్ల అయితే బార్బీ డాల్, కుకింగ్ సెట్, టెడ్డీ బేర్ వంటివి కొనివ్వడం కూడా దీనిలోకే వస్తాయి.

సొసైటీలో చాలా కామన్‌గా కనిపించే ఇలాంటి ఎన్నో విషయాలు.. రోహిణి ప్రశ్నలతో అర్రే ఇది నిజమే కదా..ఇన్నాళ్లూ దీని గురించి ఆమెలా ఇంత లోతుగా ఎందుకు ఆలోచించలేకపోయాం అనేలా చేశాయి.

బియ్యం గిన్నెను ఉదాహరణగా చెబుతూ సొసైటీ తలదించుకునే ఒక సెటైర్ వేశారు రోహిణి. అబ్బాయి చేయి తగిలితే బియ్యం ఉడకవా? బియ్యంలో నీళ్లు పోస్తే అదే అన్నం అవుతుంది.. దానికి కూడా ఆడా, మగా అనే తేడా ఎందుకు చూపిస్తున్నామంటూ ఆమె వేసిన ప్రశ్న చాలా చిన్నదే..కానీ జవాబు చెప్పేటపుడే అదెంత పవర్‌ఫుల్ ప్రశ్న అనేది అర్ధం అవుతుంది.

ఈ చిన్న పాయింట్‌తో ఆమె మన దేశంలోని జెండర్ డివిజన్ ఆఫ్ లేబర్(Gender Division of Labour) లోని డొల్లతనాన్ని కామ్రేడ్ల ముందే ఎండగట్టారు. గర్ల్ ఫ్రెండ్‌ సినిమాలో తాను నటించిన పాత్రనే ఉదాహరణగా చూపించి నిజజీవితంలోనూ ఇదే సీన్ లేదంటారా అని అందరి ముందు ధైర్యంగా ప్రశ్నించారు.

మార్పు కోసం పోరాడే కమ్యూనిస్ట్ వేదికపైనే నిలబడి, అక్కడి నాయకులకే రోహిణి ఒక ఛాలెంజ్ విసిరారు. తానూ ఓ కామ్రేడ్ నంటూ చెప్పిన ఆమె..మీరు బయట స్త్రీ సమానత్వం, ఎర్రజెండా అని ప్రసంగాలు చేస్తారు. కానీ మీ ఇంట్లో కూడా మీరు ఇదే పాటిస్తారా అని కాస్త సూటిగానే అడిగేసారు.

నిజమే ఆమె అడిగిన ప్రశ్నకు అక్కడ ఎంత మంది లోలోపల భుజాలు తడుముకున్నారో అది వారికి మాత్రమే తెలుస్తుంది. సిద్ధాంతం అంటే ప్రసంగాల్లో కాదు, మీ ఇంట్లో భార్యతో కలిసి గిన్నెలు కడగడంలో ఉండాలని ఆమె చెప్పిన తీరుకు అక్కడి వారంతా క్లాప్స్‌తో కవర్ చేసినా.. కనిపించని నిశ్శబ్దం మాత్రం ఆ కరతాళధ్వనులను డామినేట్ చేసిందనే చెప్పొచ్చు.

రోహిణి(Rohini) దృష్టిలో ఫెమినిజం అంటే పురుషులపై ద్వేషమూ కాదు.. అలా అని బయట విగ్రహాలకు పూలమాలలు వేయడం అంతకంటే కాదు. ఫెమినిజం అంటే ఒక అబ్బాయి తన తల్లికో, చెల్లికో వంటింట్లో సహాయం చేయడం నుంచే మొదలవుతుంది. స్త్రీలను బాధితులుగా కాకుండా, వారికంటూ ఒక వ్యక్తిత్వం ఉందని గుర్తించడమే ఫెమినిజం.

స్త్రీ ఎలా ఉండాలి..ఎలా బతకాలి అని సొసైటీ ఫిక్స్ చేసింది… ఆ ఫ్రేమ్ లో నుంచి బయటకు వచ్చి మనుషులుగా బతకాలని ఆమె ఇచ్చిన మెసేజ్ మాత్రం చాలా లోతయినది. ఏది ఏమయినా సీనియర్ నటి రోహిణి(Rohini)లో ఉన్న మెచ్యూరిటీ గురించి, ఆమెకు సో కాల్డ్ సొసైటీపై ఉన్న అవగాహన గురించి ఆమె మాటల్లో విన్నవారంతా ఆమెకు మనసారా మెచ్చుకున్నారన్నది మాత్రం నిజం.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button