AI :హైస్కూల్ నుంచే ఏఐ పాఠాలు..ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు
AI : అంతర్జాతీయంగా అధునాతన సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ను సిద్ధం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు.

AI
విద్యారంగ సంస్కరణల్లో ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రం భారతదేశంలోనే ముందువరుసలో ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో క్వీన్స్‌ల్యాండ్ ట్రేడ్ & ఇన్వెస్ట్‌మెంట్ సెంటర్‌లో నిర్వహించిన విద్యారంగంపై రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వెల్లడించారు.
ఏఐ విప్లవం కోసం సంస్కరణలు..అంతర్జాతీయంగా అధునాతన సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ను సిద్ధం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ కృషిలో భాగంగా, రాష్ట్రంలో కీలకమైన విద్యా సంస్కరణలను అమలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని హైస్కూలు స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నామని మంత్రి తెలిపారు. ఉన్నత పాఠశాలల్లో ఏఐ ల్యాబ్‌లు, స్టెమ్ (STEM) , రోబోటిక్స్ ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
AP ప్రభుత్వ లక్ష్యాలు.. ఏఐ విప్లవం ద్వారా భవిష్యత్తులో వచ్చే అవకాశాలను ఏపీలోని యువత పూర్తిస్థాయిలో అందుకునేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు మంత్రి వివరించారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా ఏఐ యూనివర్సిటీ (AI University) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గవర్నెన్స్‌లో ఏఐ ..పాలన (గవర్నెన్స్)లో కూడా ఏఐ వినియోగాన్ని పెంచడం ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని ఆయన తెలిపారు. విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల్లో మెరుగైన సేవలు అందించడానికి ఏఐని వినియోగిస్తున్నట్లు చెప్పారు.
ఈ సమావేశంలో భారత కాన్సులేట్ జనరల్ (బ్రిస్బేన్) నీతూ భాగోటియా, క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీ డిప్యూటీ వైస్ ఛాన్స్‌లర్ మార్క్ హార్వే సహా ఆస్ట్రేలియాలోని పలు విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.