Amaravati farmers: అమరావతి రైతులకు ప్రభుత్వ హామీలు.. నెల రోజుల్లోనే పరిష్కారం
Amaravati farmers: అమరావతికి న్యాయం? రైతుల సమస్యలపై స్పష్టమైన సమీక్ష

Amaravati farmers
రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులు (Amaravati farmers).. తమకు న్యాయం జరుగుతుందా?” అనే అనుమానంతోనే గడిపారు. ప్రత్యేకించి గత ప్రభుత్వ హయాంలో ఆందోళనలు, నిరాశ, నిర్లక్ష్యం అన్నీ వీళ్ల నిత్య జీవితాల్లో భాగం అయ్యాయి. అయితే, తాజా పాలన మారిన తర్వాత పరిస్థితి కొంచెం కొంచెంగా మారుతున్నట్టు, రైతుల మనసుల్లో ఒక ఆశ వెలుగు చూస్తోంది.
2024లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యారు. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇద్దరూ కలిసి ప్రజలకిచ్చిన హామీలను మరిచిపోకుండా, ప్రత్యేకించి అమరావతికి సంబంధించి స్పష్టమైన ప్రకటనలు ఇవ్వడం, చర్యలు చేపట్టడం – అన్నీ కలిపి రాజధాని రైతుల్లో “ఇక మళ్లీ ఒక ఆశ” పుట్టించింది. తాజాగా పట్టభూములిచ్చిన రైతుల సమస్యలపై గతంలో కీలక పాత్ర పోషించిన మంత్రి నారాయణ మళ్లీ రంగంలోకి దిగారు.

మంగళవారం అమరావతిలో (Amaravati farmers)జరిగిన రాజధాని రైతుల జేఏసీ ప్రతినిధులతో మంత్రి నారాయణ( Narayana meeting) సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు నిర్వహించిన ప్రత్యేక సమావేశం కీలకంగా మారింది. రైతుల పక్షాన 14 ప్రధాన సమస్యలపై విపుల చర్చ జరిపిన మంత్రి నారాయణ, నిర్దిష్ట కాలపథకంతో పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఇది తొలి స్థాయిలో అమరావతి రైతుల కోసం ప్రభుత్వం చూపిన ప్రాధాన్యతగా పరిశీలించబడుతోంది.
జేఏసీ నేతలు వివరించిన 14 సమస్యలపైనా మంత్రి స్వయంగా సమీక్షించి, ప్రతి అంశానికి స్పష్టమైన సమాధానాలు, టైమ్‌ఫ్రేమ్‌తోపాటు క్రియాశీల చర్యలు తీసుకుంటామన్న హామీ ఇచ్చారు. గతంలో ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన అనుభవంతో తాను చేసిన హామీలే ఇప్పుడూ అమలు చేస్తానంటూ నారాయణ స్పష్టత ఇచ్చారు.
- రైతుల్లో విశ్వాసం (Amaravati farmers) చిగురించేలా ముఖ్య హామీలు ..
రిటర్నబుల్ ప్లాట్లు: పూలింగ్‌కు ఇవ్వని భూములకు కూడా రీ–అలాట్‌మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం అంగీకరించింది. - కౌలు చెల్లింపులు: 7వ, 9వ సంవత్సరానికి సంబంధించి రూ. 900 కోట్ల చెల్లింపులు ఒక నెలలో పూర్తి చేస్తామని హామీ.
- హద్దు రాళ్ల ఏర్పాటు: గతంలో తొలగిపోయిన హద్దులు తిరిగి రెండునెలల్లో వేస్తామన్న నిర్ణయం.
- R–5 జోన్ పరిష్కారం(R-5 zone issue): ప్రతి రైతు దరఖాస్తుపై త్వరిత విచారణ – హక్కులు ఖరారుగా నిలబడేలా చర్యలు.
- గ్రామాభివృద్ధి పనులు: రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ లైన్‌లు, నీటి ప్రవాహాలపై రూ. 2,000 కోట్ల పైగా పనులు షెడ్యూల్ ప్రకారం ప్రారంభించనున్నదిగా ప్రకటన.
కేంద్ర సంస్థల ఏర్పాటుపై స్పష్టత: కేటాయించిన భూముల్లో 2025 డిసెంబర్ లోపు మెజారిటీ కేంద్ర సంస్థలు నిర్మాణం పూర్తి చేస్తాయని హామీ. - మరోవైపు సీఆర్డీయే కార్యాలయంలో ఇద్దరు అధికారుల అవినీతిపై రైతుల జేఏసీ ఫిర్యాదు చేయగా, మంత్రి నారాయణ అక్కడే అధికారులను ప్రశ్నించి, బదిలీ చేయాలంటూ కమిషనర్ కన్నబాబుకు ఆదేశాలు ఇచ్చారు. “రైతుల నమ్మకాన్ని వమ్ము చేయని విధంగా వ్యవహరిస్తాం,” అని నారాయణ గట్టిగా ప్రకటించారు.
ఇదే సమావేశంలో మంత్రి నారాయణ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక నెలలో సమస్యలు పరిష్కరించకపోతే – ఏ కారణాల వల్ల ఆలస్యం జరిగింది అన్నదానిపై అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది అని స్పష్టం చేశారు. ఇది రైతుల ఆశలకు స్పష్టమైన గ్యారంటీగా మారింది. మొత్తంగా.. ఈసారి ప్రభుత్వం మాట ఇచ్చింది. రైతుల త్యాగానికి పాలకుల నిబద్ధతను చూపించే టైం స్టార్ట్ అయ్యింది.
Also Read: Nutritional deficiencies: ఆ లోపాలున్నాయా..? మీ బాడీ మిమ్మల్ని ముందే అలర్ట్ చేస్తుందట