Just Andhra PradeshLatest News

Mantha: మొంథా సైక్లోన్ బాధితులకు కూటమి ప్రభుత్వం అండ.. నిత్యావసర సరుకుల పంపిణీ

Mantha: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారికి , అలాగే ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం సిద్ధమైంది.

Mantha

మొంథా(Mantha తీవ్ర తుపాను కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారికి , అలాగే ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం సంసిద్ధమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్దేశించిన విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.

పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికీ, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు నిత్యావసరాలను ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో (ఎక్స్ వేదికగా) తెలిపారు. సివిల్ సప్లైస్ కమిషనర్‌కు ప్రభుత్వం తక్షణమే పంపిణీని ప్రారంభించాలని ఆదేశాలు జారీచేసింది. కూరగాయలు, ఉల్లిపాయల సరఫరా నిరంతరంగా సాగేందుకు మార్కెటింగ్ కమిషనర్ పర్యవేక్షణ చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.

Cyclone Mantha
Cyclone Mantha

బాధితులకు ఉచితంగా అందించే నిత్యావసరాల వివరాలను ఎక్స్ వేదికగా డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మొంథా (Mantha)సైక్లోన్ బాధితులకు ప్రభుత్వం పంపిణీ చేయనున్న నిత్యావసర సరుకుల పరిమాణం కుటుంబాల వర్గీకరణ ఆధారంగా మారుతుంది.

బియ్యం బాధిత మత్స్యకార మరియు చేనేత కార్మిక కుటుంబానికి – 50 కేజీలు చొప్పున..సాధారణ బాధిత కుటుంబాలకు – 25 కేజీలు చొప్పున అందిస్తారు. అలాగే ఇతర నిత్యావసరాలు (అన్ని కుటుంబాలకు) కందిపప్పు – 1 కిలో, పామాయిల్ (నూనె) – 1 లీటరు, ఉల్లిపాయలు – 1 కిలో, బంగాళాదుంపలు – 1 కిలో, పంచదార – 1 కిలో అందించనున్నారు.

పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలను అనుసరించి ఆ శాఖ అధికార యంత్రాంగం నిత్యావసరాలను సిద్ధం చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని 14,415 రేషన్ షాపుల్లో 1 లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం, 3424 మెట్రిక్ టన్నుల పంచదారతోపాటు ఇతర నిత్యావసరాలను పంపిణీకి సిద్ధంగా ఉంచారు. నిత్యావసరాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది. హోమ్, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సహాయ చర్యలను, ఆహారం, నిత్యావసరాల పంపిణీని సమన్వయం చేస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button