Just Andhra PradeshLatest News

Nara Lokesh: ఏపీని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు డిజైన్లు ఇవ్వండి.. నారా లోకేష్ విజ్ఞప్తి!

Nara Lokesh: మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పాపులస్ (Populous) సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు.

Nara Lokesh

ఆంధ్రప్రదేశ్‌ను (AP) క్రీడా రంగంలో అగ్రస్థానంలో నిలపడానికి, అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ ప్రయత్నంలో భాగంగా, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పాపులస్ (Populous) సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు.

పాపులస్ సంస్థ పరిచయం..పాపులస్ సంస్థ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన స్టేడియాలకు వినూత్నమైన డిజైన్ రూపకల్పన, నిర్మాణంలో పేరొందింది. క్రీడా సౌకర్యాలు, మైదానాలు, ఈవెంట్ స్థలాల డిజైనింగ్ మరియు నిర్మాణంలో 40 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఈ సంస్థ, $60 బిలియన్ల విలువైన 3,500కు పైగా ప్రాజెక్టులను చేపట్టింది.

అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియం, లండన్ ఒలింపిక్ స్టేడియం, కాలిఫోర్నియాలోని సోఫీ స్టేడియం వంటి అనేక అద్భుతమైన నిర్మాణాల డిజైన్లు ఈ సంస్థ రూపొందించినవే. భారతదేశంలో ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఎల్ అండ్ టీ (L&T) తో కలిసి ఈ సంస్థ పనిచేస్తోంది.

Nara Lokesh
Nara Lokesh

మంత్రి లోకేష్(Nara Lokesh) విజ్ఞప్తులు – డిజైనింగ్ సహకారం..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి విజన్‌కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ను స్పోర్ట్స్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో, మంత్రి లోకేష్ పాపులస్ సంస్థకు పలు కీలక విజ్ఞప్తులు చేశారు.

Nara Lokesh
Nara Lokesh

అత్యాధునిక స్టేడియంలు.. రాష్ట్రంలో అత్యాధునిక స్పోర్ట్స్ స్టేడియంలు, అంతర్జాతీయ స్థాయి శిక్షణా సౌకర్యాలకు వినూత్న డిజైన్లు అందించడం ద్వారా క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకారం అందించాలి.

Nara Lokesh
Nara Lokesh

పర్యావరణ ప్రమాణాలు: ప్రపంచ పర్యావరణ ప్రమాణాలతో కూడిన, స్థిరమైన (Sustainable), మరియు ఎనర్జీ ఎఫీషియంట్ స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ వేదికల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి.

కమ్యూనిటీ డిజైన్లు.. క్షేత్రస్థాయిలో క్రీడలు, ప్రజారోగ్య కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన కమ్యూనిటీ క్రీడా సముదాయాలు, వినోద స్థలాల అభివృద్ధికి కమ్యూనిటీ సెంట్రిక్ డిజైన్లు అందించాలి.

ap-a-sports-hub
ap-a-sports-hub

పట్టణ ప్రణాళిక.. టూరిజం, స్థానిక ఆర్థిక వ్యవస్థలకు బలం చేకూర్చేలా సాంస్కృతిక, క్రీడలు, వినోద కార్యక్రమాల నిర్వహణ కోసం ఇంటిగ్రేటెడ్ ఈవెంట్ స్పేస్ అభివృద్ధికి సంబంధించిన పట్టణ ప్రణాళిక ప్రాజెక్టులపై డిజైనింగ్ సహకారాన్ని అందించాలని మంత్రి కోరారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button